Vijay Deverakonda : ఎన్ని తిట్లు తిట్టిన పడతాను.. కానీ ఎప్పటికైనా అది సాధిస్తా.. విజయ్ కామెంట్స్ వైరల్

|

Apr 03, 2024 | 1:02 PM

ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కానుంది. పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో గతంలో గీత గోవిందం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరో సారి హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

Vijay Deverakonda : ఎన్ని తిట్లు తిట్టిన పడతాను.. కానీ ఎప్పటికైనా అది సాధిస్తా.. విజయ్ కామెంట్స్ వైరల్
Vijay Devarakonda
Follow us on

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కానుంది. పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో గతంలో గీత గోవిందం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరో సారి హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ప్రమోషన్స్ లో మూవీ టీమ్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఎప్పటికైనా రూ. 200 కోట్ల కలెక్షన్స్ సాధిస్తా అని అన్నారు విజయ్ దేవరకొండ. లైగర్ సినిమా టైం లో విజయ్ రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.. ఆ కామెంట్స్ గురించి తాజాగా మరోసారి మాట్లాడారు విజయ్ దేవరకొండ. కెరీర్ స్టార్టింగ్ లో 100 కోట్ల కలెక్షన్స్ రావాలని కలలు కన్నాను. గీతగోవిందం సినిమాతో అది నెరవేరింది.

గీతగోవిందం తర్వాత దాన్ని బీట్ చేసే సినిమా రాలేదన్న విజయ్ ఓ సినిమా (లైగర్) టైంలో నేను రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని అనుకున్నా.. అలా స్టేట్ మెంట్ ఇవ్వడం నా పొగరు కాదు.. ఎదో ఒకరోజు రూ. 200 కోట్లు సాధిస్తా అని చెప్పారు విజయ్. రూ.200 కోట్ల స్టేట్‍మెంట్ ఎందుకు ఇచ్చావ్ అని నన్ను చాలా మంది అడిగారు. కచ్చితంగా ఎప్పుడో ఒకసారి దాన్ని సాధిస్తా.. ఇది నా పొగరు కాదు నా కాన్ఫిడెన్స్ అని అన్నారు. అలాగే 200 కోట్లు కొడతా అనడం తప్పు కాదు.. అలా చెప్పి కొట్టకపోవడం నా తప్పే.. దాని వల్ల ఎన్నో తిట్లు తిన్నా.. అవమానాలు భరించా.. అని అన్నారు. ఎప్పటికైనా రూ. 200 కోట్లు సాధిస్తా అన్నారు విజయ్. రూ. 200 కోట్లు కొట్టే వరకు ఎన్ని తిట్లు తిట్టినా పర్లేదు అని అన్నారు విజయ్.

విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.