సక్సెస్ కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఓ బాలీవుడ్ బ్యూటీ వరుసగా ప్రయోగాలు చేస్తున్నారు. గ్లామర్ ఇమేజ్ వర్క్ అవుట్ కాకపోవటంతో.. బోల్డ్ కంటెంట్ కూడా ట్రై చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? 2013లో గ్లామర్ స్టార్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్. స్కిన్ షో విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోని ఈ భామ.. స్టార్ ఇమేజ్‌ను అందుకునే విషయంలో మాత్రం వెనకబడే ఉన్నారు. కెరీర్‌లో ఒక్క వార్ మూవీ తప్ప మరో హిట్ లేకపోవటంతో అమ్మడికి అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. రణబీర్ సరసన నటించిన షంషేరా మీద భారీ ఆశలు పెట్టుకున్నా ఆ సినిమా అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. దీంతో నెక్ట్స్ ఓ బోల్డ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోర్న్ స్టార్ పోలికలతో ఉన్న అమ్మాయిగా తెర మీద కనిపించబోతున్నారు వాణీ. సర్వగుణ సంపన్న పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ వాణీ కపూర్ చేస్తున్న ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కావటం మరో విశేషం.
స్వరగుణ సంపన్న సెట్స్ మీద ఉండగానే డిజిటల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న మండాల మర్డర్స్ సినిమాతో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో అయినా కెరీర్‌లో సక్సెస్ వస్తుందన్న ఆశతో ఉన్నారు.
ఇన్నేళ్ల కెరీర్‌లో తన అనుభవాల గురించి కూడా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు వాణీ కపూర్. సక్సెస్‌కు షార్ట్ కట్స్ ఉండవన్న ఈ బ్యూటీ.. మనం ఎంత కష్డపడినా.. ఆడియన్స్ ఆదరించినప్పుడు హిట్ హీరోయిన్ అన్న ట్యాగ్ దక్కుతుందని వేదాంతం మాట్లాడుతున్నారు.