Tollywood: కొత్త పుంత‌లు తొక్కుతున్న టాలీవుడ్.. ర‌క‌ర‌కాలు కాంబినేష‌న్‌లు, అంత‌కుమించిన‌ ఈక్వేష‌న్లు

|

Jun 30, 2021 | 6:59 PM

తెలుగు హీరోలంతా నార్త్‌ వైపు చూస్తూ వియ్యార్ జస్ట్‌ ఫర్ పాన్ ఇండియా అంటున్నారు. దీంతో టాలీవుడ్‌లో వ్యాక్యూమ్ ఏర్పడి.. హీరోల కొరత కనిపిస్తుందో లేదో గాని..

Tollywood: కొత్త పుంత‌లు తొక్కుతున్న టాలీవుడ్.. ర‌క‌ర‌కాలు కాంబినేష‌న్‌లు, అంత‌కుమించిన‌ ఈక్వేష‌న్లు
Tollywood
Follow us on

తెలుగు హీరోలంతా నార్త్‌ వైపు చూస్తూ వియ్యార్ జస్ట్‌ ఫర్ పాన్ ఇండియా అంటున్నారు. దీంతో టాలీవుడ్‌లో వ్యాక్యూమ్ ఏర్పడి.. హీరోల కొరత కనిపిస్తుందో లేదో గాని.. అటువంటి బెంగ పెట్టుకోవద్దు.. మీకు మేమున్నాంగా అంటున్నారు తమిళ్ హీరోలు. ఎస్.. ఇప్పుడీ పొరుగింటి పుల్లకూర సామెతే సౌతిండియన్ స్టార్‌డమ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. కోలీవుడ్‌ హీరో ధనుష్‌ని వెంటబెట్టుకుని తెలుగు ఆడియన్స్‌కి న్యూ ఫ్లేవర్స్ చూపిస్తానన్న శేఖర్ కమ్ముల.. ఆ విధంగా ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యారు. తెలుగు-తమిళ్… రెండు నేటివిటీస్‌ని జోడించి శేఖర్ చెయ్యబోయే ఆ కమ్మటి కాఫీ గురించి రెండు వైపులా వెయిటింగ్‌ మొదలైంది. ఆ పాటికే ధనుష్ రూట్లోనే వున్నారు మరో ఇద్దరు తమిళ్ హీరోలు.

అఖండ తర్వాత బోయపాటి డైరెక్షన్‌లో సూర్య నటించబోతున్నారు. తెలుగు సినిమాల్లో యాక్షన్‌ స్టఫ్‌నీ, స్టంట్ సీన్లను ఏదోలా చూసే తమిళ తంబీల మైండ్‌సెట్‌ని మార్చే బాధ్యత తీసుకోబోతున్నారట బోయపాటి. ఇక.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ చెయ్యబోయే మూవీ కూడా ఆన్‌ ది కార్డ్స్ అంటున్నారు ప్రొడ్యూసర్ దిల్‌రాజు. పాన్ సౌత్ మార్కెట్‌కి టెండరేసిన ధనుష్.. తన రాడార్‌ని ఇంకాస్త స్ప్రెడ్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్ మీద మరో సినిమా కమిటయ్యారట ఈ కొలవెరి కుర్రాడు. సాహో స్పెషలిస్టు సుజీత్‌ మేకింగ్‌కి ఫిదా అయ్యానని అప్పుడెప్పుడో చెప్పిన ధనుష్.. ఇప్పుడు ఆ సుజీత్‌నే తన కెప్టెన్ల లిస్టులో చేర్చబోతున్నారట. అటు.. వెంకీ అట్లూరి దగ్గర కూడా కొన్ని కథలు వింటున్న ధనుష్.. అచ్చమైన తెలుగబ్బాయిలా మారిపోతున్నారు. సో… టాలీవుడ్… కొద్దికొద్దిగా కోలీవుడ్‌ కలర్‌లోకి మారబోతోందా అనేవి కొత్త డౌట్స్‌.

Also Read: వామ్మో..! ఈ తాచుపాము మాముల్ది కాదు.. ఏకంగా 3 అడుగుల కోబ్రాను మింగేసింది.. కానీ

 రోహిత్​కు సారీ చెప్పిన అతడి భార్య రితిక… ఎందుకో తెలుసా ?