Samantha: హీరోయిన్ సమంత వేలికి స్పెష‌ల్ రింగ్.. ఫొటోస్ వైరల్.. నెటిజన్ల రియాక్షన్స్ వైరల్

ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో ఆమె రిలేషన్ లో ఉందని తెగ ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తున్నారు

Samantha: హీరోయిన్ సమంత వేలికి స్పెష‌ల్ రింగ్.. ఫొటోస్ వైరల్.. నెటిజన్ల రియాక్షన్స్ వైరల్
Samantha

Updated on: Aug 01, 2025 | 9:45 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే శుభం చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతోనే ఆమె నిర్మాతగా కూడా మారింది. ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌ వెబ్‌సిరీస్‌ లె నటిస్తోందీ అందాల తార. అలాగే నందినీ రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం సినిమాను నిర్మించడంతో పాటు అందులోనూ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇటీవల ఇతర విషయాల్లోనూ సమంత పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆమెతో పాటు బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరు కనిపిస్తుండడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇటీవలే ఇద్దరు కలిసి డిన్నర్‌ చేసిన తర్వాత ఓకే కారులో వెళ్లడం, ఆ ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఈ జంట డేటింగ్‌ వ్యవహారంపై మరోసారి రూమర్లు వచ్చాయి. అంతకు ముందు లండన్‌ వీధుల్లో ఇద్దరు కలిసి చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే తమ డేటింగ్, రిలేషన్ విషయాలపై అటు సామ్ కానీ ఇటు రాజ్ కానీ నోరు విప్పడం లేదు.

తాజాగా ఓ రెస్టారెంట్‌లో ఉన్న ఫొటోలను సామ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చిల్‌ అవుతూ కనిపించింది సామ్. అయితే ఇందులో ఒక ఫోటోలో మాత్రం సమంత చేతికి ఉంగరం కనిపించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇంతకుముందు ఎప్పుడు సామ్ చేతికి ఈ రింగ్‌ కనిపించలేదు. ఇప్పుడు ఉన్నట్లుండి రింగ్ తో కనిపించడంతో నెటిజన్లు భిన్న రకాలుగా అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ రూమర్లపై సామ్ కానీ, రాజ్ కానీ స్పందించడం లేదు. కానీ రాజ్ భార్య మాత్రం తరచూ ఏవో క్రిప్టిక్ పోస్టులు షేర్ చేస్తోంది.

చేతికి స్పెషల్ రింగ్ తో సామ్.. ఫొటోస్ ఇదిగో..

రాజ్‌ నిడిమోరు తెరకక్కించిన ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌- 2, సిటాడెల్‌: హనీ బన్నీ వెబ్ సిరీసుల్లో సామ్ నటించింది. ఈ క్రమంలోనే రాజ్- సమంతల మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇప్పుడు వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగానే కనిపిస్తున్నారు.

చీరకట్టులో ఎంత చక్కగుందో..

మహానటి కీర్తి సురేశ్ తో సమంత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి