
తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు మెగాస్టార్ చిరంజీవి. అటు మాస్, యాక్షన్, ఇటు రొమాంటిక్ లవ్ స్టోరీలతో ఆకట్టుకున్నారు. కానీ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ గురించి మీకు తెలుసా.. ? అప్పట్లో తెలుగులో చిరుతో కలిసి అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరంటే.. తనే లేడీ అమితాబ్ విజయశాంతి. రాధిక తర్వాత చిరంజీవి పక్కన అత్యధిక చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ జోడీగా సరికొత్త రికార్డ్ సృష్టించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ఇప్పటికీ ఆ చిత్రాలు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాయి. ఎనభై, తొంభైల కాలంలో వెండితెరను ఏలిన ఈ క్రేజీ జోడి, థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. డ్యాన్స్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ.. ఇలా ఏ జోనర్ సినిమా అయినా సరే, వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేసేది. చెన్నైలోని శారదా స్టూడియోలో వేర్వేరు ఫ్లోర్లలో షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరు, విజయశాంతి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం సంఘర్షణ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది.
ఆ తర్వాత కేవలం పదేళ్ల కాలంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఏకంగా 19 సినిమాలు వచ్చాయి. . వీరిద్దరి కెరీర్‌ను మలుపు తిప్పిన కొన్ని అద్భుతమైన హిట్ చిత్రాల జాబితా ఇక్కడ చూద్దాం:
ఒకే హీరోయిన్‌తో కలిసి నాలుగు ఇండస్ట్రీ హిట్లు (ఆ కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు సినిమాలు) సాధించిన అరుదైన రికార్డు చిరంజీవి-విజయశాంతిలకే దక్కింది. ‘పసివాడి ప్రాణం’, ‘యముడికి మొగుడు’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాలు టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి మాస్ మేనరిజమ్స్, విజయశాంతి ‘శాంతి’ పాత్రల మధ్య కెమిస్ట్రీ, ‘అబ్బా నీ తీయని దెబ్బ’ పాటలో వీరిద్దరి డ్యాన్స్ మూమెంట్స్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి.
అటు నటనలోనూ, ఇటు డ్యాన్స్‌లోనూ చిరంజీవికి సరిసమానంగా పోటీ ఇస్తూ విజయశాంతి చేసిన నటన వల్లే వీరి కాంబినేషన్‌కు అంతటి క్రేజ్ లభించింది. చివరగా వీరిద్దరు కలిసి నటించిన సినిమా మెకానిక్ అల్లుడు. ఈ మూవీ సైతం మాస్ ప్రేక్షకులను అలరించింది. కాలం మారిన… ఇద్దరు పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ వెండితెరపై సృష్టించిన వైబ్రేషన్స్ మాత్రం మారలేదు. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఈ జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
Vijayashanti, Chiranjeevi