సుప్రిత పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ నటి సురేఖావాణి కూతురు ఈ అమ్మడు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నదానికి మంచి ఫాలోయింగ్ ఉంది. సురేఖ వాణి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె తన కూతురిని కూడా ఇండస్ట్రీలో ఉంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో అమ్మడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. అందంలో హీరోయిన్స్ తో పోటీపడుతోంది ఈ చిన్నది. అంతే కాదు అందాలతోనూ కవ్విస్తుంది సుప్రిత. తల్లి సురేఖ వాణితో కలిసి రీల్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. సుప్రిత, సురేఖ వాణి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
అయితే కొందరు నెటిజన్స్ సుప్రిత చేసిన రీల్స్ ను ట్రోల్ కూడా చేశారు. తాజాగా మరోసారి ట్రోలర్స్ బారిన పడింది సుప్రిత. ట్రోలర్స్ పై ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఈ బ్యూటీ. తాజాగా తన పై జరుగుతున్న ట్రోల్స్ పై స్పందించింది. ఈ సారి ట్రోల్స్ తనకు బాధించాయి అని తెలిపింది. అసలు సుప్రిత ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే..
తాజాగా తెలంగాణ ఎలా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు సురేఖ, సుప్రిత. ఈ క్రమంలో ఆయనతో గతంలో దిగిన ఫోటోను షేర్ చేశారు. దాంతో ఇప్పుడు కొందరు సురేఖ, సుప్రితను ట్రోల్ చేస్తున్నారు. అంతే కాదు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. అందుకు కారణం ఏంటంటే. ఎన్నికలకు ముందు సురేఖ వాణి, సుప్రిత ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ కు సపోర్ట్ గా పలు రీల్స్ చేశారు. డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో షేర్ చేయడంతో వీరిపై నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దాంతో సుప్రిత స్పందిస్తూ.. పొలిటికల్ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు. నేను ముందుగా బీఆర్ఎస్‌కు సపోర్టు చేశాను కరెక్టే .. అందులో తప్పేముంది. ఆతర్వాత గెలిచిన రేవంత్ రెడ్డికి విషెస్ చెప్పాను. దీనికే నన్ను ట్రోల్ చేయడం ఏంటి..? నేను మీకేం అన్యాయం చేశాను..? నాపై ఎందుకింత నెగిటివిటీ పెంచుకున్నారు. మీరు చేస్తున్న ట్రోలింగ్ వల్ల నా మానసిక స్థితి పై చాలా ప్రభావం చూపిస్తుంది. దాన్ని అర్థం చేసుకోండి. అంటూ రాసుకొచ్చింది.
NO FAKE NO BOT
JUST ORIGINALడిజిటల్ రంగంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన #TV9Telugu pic.twitter.com/nBSqWBMn6R
— TV9 Telugu (@TV9Telugu) December 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.