Mahesh Babu: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తుంది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు నిర్దారిస్తూ జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‏లుగా సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ధారించింది.

Mahesh Babu: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్..
Mahesh Babu Cm Jagan

Updated on: Mar 09, 2022 | 7:32 AM

Mahesh Babu: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తుంది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు నిర్దారిస్తూ జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‏లుగా సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‏లు.. నాలుగు కేటగిరీలుగా విభజించింది. అందులో కనీసం 20,గరిష్టంగా 250 గా రేట్ల నిర్దారించింది. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ కేటగిరీలుగా థియేటర్ల టికెట్స్ రేట్స్ ఫిక్స్ చేసింది. ఒక్కో థియేటర్ లో కేవలం రెండే రకాల టిక్కెట్లు ఉండగా.. ప్రీమియం,నాన్ ప్రీమియంగా రేట్ల నిర్దారణ జరిగింది. అంటే.. ప్రతి థియేటర్లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన పలువురు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా మహేష్ బాబు కూడా జగన్ కు థాంక్స్ చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తూ మహేష్ ట్వీట్ చేశారు. మున్ముందు ఏపీ ప్ర‌భుత్వం, సినీ ప‌రిశ్ర‌మ మ‌ధ్య మ‌రింత మెరుగైన సంబంధాలు నెల‌కొనేలా ముందుకు సాగుతామ‌ని మహేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అలాగే జగన్ తోపాటు  ఏపీ మంత్రి పేర్ని నానికి కూడా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు మహేష్.  మొన్నటివరకు సినిమా టికెట్స్ రేట్లపై టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వివాదం నడిచిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ ప్రముఖులు.. డిస్టిబ్యూటర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి, రాజమౌళి, మహేష్, ప్రభాస్, నారాయణమూర్తి, కొరటాల శివలు సీఎం జగన్‌ను కలిశారు. టిక్కెట్ల ధరల విషయంలో మరో నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇప్పుడు టాలీవుడ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సరసన ఆ ముద్దుగుమ్మ.. బాబీ.. చిరు సినిమాలో హీరోయిన్ ఎవరంటే..

Priyanka Jawalkar: కుర్రాళ్లను ఫిదా చేస్తున్న ముద్దుగుమ్మ.. ప్రియాంక కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. (ఫొటోస్)

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..

Loading...
Unable to load recommendations.
Follow Us