Srinu Vaitla: టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం.. అనారోగ్యంతో కన్నుమూత

|

Nov 28, 2021 | 8:41 AM

Srinu Vaitla father passed away: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున కృష్ణారావు

Srinu Vaitla: టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం.. అనారోగ్యంతో కన్నుమూత
Srinu Vaitla
Follow us on

Srinu Vaitla father passed away: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున కృష్ణారావు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణారావు మృతితో శ్రీను వైట్ల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీను వైట్లకు ఫోన్‌ చేసి సంతాపం తెలుపుతున్నారు. కాగా.. కృష్ణారావు అంత్యక్రియలు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలోని కందులపాలెంటో జరగనున్నట్లు బంధువులు పేర్కొంటున్నారు.

Also Read:

Horoscope Today: ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఆదివారం రాశిఫలాలు..

Heavy Rainfall: నీటిలోనే నానుతున్న చెన్నై.. మరో వార్నింగ్ జారీ చేసిన ఐఎండీ..