Ratan Tata: లెజెండ్స్ పుడతారు..  శాశ్వతంగా జీవిస్తారు.. రతన్ టాటా మృతికి రాజమౌళి సంతాపం

|

Oct 10, 2024 | 12:42 PM

కమల్ హాసన్, SS రాజమౌళి,ఎన్టీఆర్, రానా దగ్గుబాటి అలాగే ఇతర ప్రముఖులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తమ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే  లెజెండరీ బిజినెస్ టైటాన్‌కు నివాళులర్పించారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పందిస్తూ..

Ratan Tata: లెజెండ్స్ పుడతారు..  శాశ్వతంగా జీవిస్తారు.. రతన్ టాటా మృతికి రాజమౌళి సంతాపం
Ratan Tata
Follow us on

వ్యాపార దిగ్గజం రతన్ టాటా అక్టోబర్ 9 బుధవారం కన్నుమూశారు. 86 ఏళ్ల రతన్ టాటా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రతన్ టాటా మరణ వార్త తెలియగానే సినీ ఇండస్ట్రీ  శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణానంతరం, కమల్ హాసన్, SS రాజమౌళి,ఎన్టీఆర్, రానా దగ్గుబాటి అలాగే ఇతర ప్రముఖులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తమ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే  లెజెండరీ బిజినెస్ టైటాన్‌కు నివాళులర్పించారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పందిస్తూ.. “రతన్ టాటా జీ నా వ్యక్తిగత హీరో మీరు,  మిమల్ని నేను నా జీవితంలో ఎప్పుడూ అనుసరించడానికి ప్రయత్నించాను. ఆధునిక చరిత్ర కథలో దేశ నిర్మాణానికి వారి సహకారం ఎల్లప్పుడూ ఉంది. ఇది మాత్రమే కాదు, కమల్ హాసన్ తన పోస్ట్‌లో రతన్ టాటా కోసం చాలా రాశారు.

రతన్ టాటా మరణవార్త విన్న తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా పోస్టింగ్ చేయకుండా ఆపుకోలేకపోయారు. తన సంతాపాన్ని తెలియజేస్తూ, లెజెండ్స్ పుడతారు..  శాశ్వతంగా జీవిస్తారు. టాటా ఉత్పత్తులను ఉపయోగించకుండా ఒక్కరోజు కూడా జీవించడం కష్టం, పంచభూతాలతో పాటు ఎవరైనా కాలపరీక్షకు నిలబడితే, అది ఆయనే.. భారతదేశం కోసం మీరు చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు సర్. అని రాజమౌళి అన్నారు.

తన్ టాటా మరణానంతరం జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక భావోద్వేగ పోస్ట్ ను షేర్ చేశారు. ఇండస్ట్రీకి చెందిన టైటన్, బంగారు హృదయం! రతన్ టాటా జీ  నిస్వార్థ దాతృత్వం, దూరదృష్టి గల నాయకత్వం ఎంతో మంది ప్రజల జీవితాలను మార్చాయి. ఆయనను భారతదేశం కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అన్ని అన్నారు. అలాగే  రానా దగ్గుబాటి తన X హ్యాండిల్‌లో అతని వారసత్వం కొనసాగుతుంది అలాగే భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. “ఈ రోజు భారతదేశం ఒక లెజెండ్‌ను కోల్పోయింది” అని అన్నారు. అలాగే ధనుష్, ఏ ఆర్ రెహమాన్ కూడా రతన్ టాటా మృతికి సంతాపం తెలిపారు.

ఎన్టీఆర్ ..

రాజమౌళి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.