స్కూల్ ముందు సమోసాలు అమ్మిన తండ్రి.. కట్ చేస్తే కూతురు ఇండస్ట్రీలో టాప్ సింగర్.. కోట్లల్లో ఆస్తుపాస్తులు

పై ఫొటోలో కనిపిస్తున్న నటి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ సింగర్. ఎన్నో క్లాసిక్ పాటలను రీమేక్ చేయడంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అనేక సూపర్ హిట్ సాంగ్స్ అద్భుతంగా ఆలపించి శ్రోతల హృదయాలను మైమరపించింది. ఇప్పుడు బుల్లితెరపై పలు సింగింగ్ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది.

స్కూల్ ముందు సమోసాలు అమ్మిన తండ్రి.. కట్ చేస్తే కూతురు ఇండస్ట్రీలో టాప్ సింగర్.. కోట్లల్లో ఆస్తుపాస్తులు
Singer

Updated on: Aug 04, 2026 | 8:03 AM

హీరోయిన్స్ మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో సింగర్స్ కూడా అందంతో ఆకట్టుకుంటున్నారు. మన దగ్గర అందాల సింగర్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. ఆమె గాత్రానికే కాదు అందానికి కూడా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. సినిమా సాంగ్స్ కంటే ప్రైవేట్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఆమె ఈ స్థాయికి అంత ఈజీగా రాలేదు. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కున్న ఆమె చిన్నతనం నుంచి స్ట్రగుల్స్ చూసింది. ఆమె తండ్రి స్కూల్ ముందు సమోసాలు అమ్మేవారు. చిన్నతనంలో ఆర్థిక సమస్యలను దగ్గరుండి చూశా అని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ప్రస్తుతం సినీ పరిశ్రమలో గాయనిగా కొనసాగుతున్న ఆ బ్యూటీ.. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది. అలాగే చాలాసార్లు ఆమె సింగింగ్ పై విమర్శలు కూడా వచ్చాయి. కానీ అవేం పట్టించుకోకుండా లైఫ్ గడిపేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా

ఆ అందాల సింగర్ మారేవరో కాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ నేహా కక్కర్. సింగర్ నేహా కక్కర్ జూన్ 6, 1988న ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జన్మించింది. తండ్రి రిషికేశ్ కక్కర్. తల్లి నీతి కక్కర్. సోదరుడు టోనీ కక్కర్ సంగీత దర్శకుడు. సోదరి సోను కక్కర్ కూడా సింగర్. ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన నేహా కక్కర్.. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఢిల్లీకి మకాం మార్చింది. చిన్న వయసులోనే పాటలు పాడడం ప్రారంభించింది నేహా కక్కర్. చిన్నప్పటి నుంచే అనేక కచేరీలలో పాటలు పడింది. ఆమె సోదరి సోను కక్కర్‌తో కలిసి ఆలయాల్లో భజనలు, కీర్తనలు కూడా ఆలపించింది ఈ అమ్మడు. అయితే చిన్నవయసులోనే నేహా కక్కర్ కుటుంబం ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు

ఆమె తండ్రి రిషికేశ్‏లో తాను, తన సోదరి చదివిన పాఠశాల ముందు సమోసాలు అమ్మేవాడని గతంలో నేహా కక్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ ఆర్ధిక కష్టాల నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని తెలిపింది. ఇక  ప్రస్తుతం నేహా ఆస్తుల విలువ రూ. 65కోట్లకు పైగానే ఉన్నాయని తెలుస్తుంది. నేహా కక్కర్ 2005 సంవత్సరంలో ‘ఇండియన్ ఐడల్’ సీజన్ 2 షోతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత, ఆమె అనేక బాలీవుడ్ పాటలు పాడింది. ప్రస్తుతం బీటౌన్ ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా స్థానం సంపాదించుకుంది.  నెట్టింట కూడా ఈ ముద్దుగుమ్మకు భారీ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us