Shruti Haasan: శ్రుతిహాసన్ సిక్రెట్‏గా పెళ్లి చేసుకుందా ?.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

|

Dec 27, 2023 | 11:09 AM

ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో రూమర్స్ ఎక్కువగా వస్తుంటాయి. పెళ్లి, విడాకులు అంటూ నిత్యం నెట్టింట చర్చలు జరుగుతుంటాయి. తాజాగా హీరోయిన్ శ్రుతిహాసన్ పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు శాంతను హజారికను శ్రుతి సిక్రేట్ గా పెళ్లి చేసుకుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై శ్రుతి రియాక్ట్ కాలేదు. ఇక ఇప్పుడు మరోసారి శ్రుతి పెళ్లి గురించి రూమర్స్ మొదలయ్యాయి

Shruti Haasan: శ్రుతిహాసన్ సిక్రెట్‏గా పెళ్లి చేసుకుందా ?.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Shruti Haasan,santanu Hazar
Follow us on

సాధారణంగా సినీ తారల వ్యక్తిగత జీవితం గురించి నిత్యం అనేక వార్తలు వినిపిస్తుంటాయి. ప్రేమ, పెళ్లి విషయంలో ఎన్నో రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. అయితే వాటిపై కొందరు నటీనటులు స్పందిస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం తమపై వచ్చిన రూమర్స్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వదిలేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో రూమర్స్ ఎక్కువగా వస్తుంటాయి. పెళ్లి, విడాకులు అంటూ నిత్యం నెట్టింట చర్చలు జరుగుతుంటాయి. తాజాగా హీరోయిన్ శ్రుతిహాసన్ పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు శాంతను హజారికను శ్రుతి సిక్రేట్ గా పెళ్లి చేసుకుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై శ్రుతి రియాక్ట్ కాలేదు.

ఇక ఇప్పుడు మరోసారి శ్రుతి పెళ్లి గురించి రూమర్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓరీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రుతికి పెళ్లైందంటూ వ్యాఖ్యలు చేశాడు. రెడ్డిట్ హ్యాండిల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓరీ మాట్లాడుతూ.. ఒకసారి శ్రుతి హాసన్ తనతో రూడ్‏గా ప్రవర్తించిందని గుర్తుచేసుకున్నాడు. ఫోటో దిగుతున్న సమయంలో శ్రుతి తనతో ప్రవర్తించిన తీరుతో తనకు బాధగా అనిపించిందని.. బహుశ ఆమె భర్తతో నేను మంచిగా ఉండడం వలన శ్రుతి అపార్థం చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో శ్రుతిహాసన్ పెళ్లి వార్తలు మరోసారి నెట్టింట వైరలయ్యాయి.

Shruti Haasan

తాజాగా తన పెళ్లి రూమర్స్ పై స్పందించింది శ్రుతి. “నాకు ఇంకా పెళ్లికాలేదు. ప్రతి విషయం గురించి మీతో పంచుకునే నేను.. పెళ్లి గురించి ఎందుకు దాస్తాను ?.” అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం శ్రుతి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శంతనుతో శ్రుతి కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అతడితోనే ఆమె వివాహం జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్స్ కు క్లారిటీ ఇచ్చేసింది శ్రుతి. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాలతో హిట్స్ అందుకున్న శ్రుతి..ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.