తమ ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తలను టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ ఖండించారు. తాను క్షేమంగానే ఉన్నానని.. తన అభిమానులెవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. సీనియర్ హీరో సుమన్ ఇక లేరంటూ గత కొద్ది రోజులుగా ఉత్తరాదికి చెందిన పలు యూట్యూబ్ ఛానల్స్ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్లో భాగంగా బెంగుళూరులో ఉన్న సుమన్ తన సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకుని ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్ని అవాస్తవమని.. అలాంటి రూమర్స్ ప్రసారం చేస్తున్న సదరు యూట్యూబ్ ఛానల్స్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తన గురించి నిరాధరమైన వార్తలు ప్రసారం చేసినందకు ఆ యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయనున్నట్లు సుమన్ (Suman) తెలిపారు.
తెలుగు చిత్రపరిశ్రమలో హీరోగా నటించిన ఆ తర్వాత సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుమన్. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. సుమన్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుమన్.. ప్రస్తుతం సహాయ పాత్రలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ ఇక లేరంటూ ఉత్తరాదికి చెందిన పలు యూట్యూబ్ ఛానల్స్ వార్తలు ప్రసారం చేశాయి. వాటిని చూసిని సుమన్ అభిమానులు, సన్నిహితులు ఆందోళనకు గురయ్యారు. ఈ వార్తల్లో నిజమెంత ? అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. తన సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుమన్… ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. ఇలాంటి రూమర్స్ ప్రసారం చేస్తున్న సదరు యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు.