
‘వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబును’.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ఇన్ స్టా గ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్.. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసినా ఈ సాంగ్ స్టెప్పులు, డ్యాన్సులే దర్శనమిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్దుల దాకా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ ఇదే వైరల్ వయ్యారీ పాటకు అద్దిరిపోయే స్టెప్పులేశారు. వృద్ధురాలి జోష్ ను చూసి స్టార్ యాంకర్ సుమ కూడా ఆమెతో కాలు కదిపింది. ఇంకే ముంది స్టేజ్ దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.
ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతను నటించిన మొదటి సినిమా ‘జూనియర్’ విడుదలకు ముస్తాబవుతోంది. . ‘మాయాబజార్’ ఫేమ్ దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం (జులై 18) ఒకేసారి కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజవుతోంది. టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలోని వైరల్ వయ్యారీ సాంగ్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్పులకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పాటకు సీనియర్ నటి, బామ్మ పాత్రలకు ఫేమస్ అయిన మణి తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇందుకు వేదిక అయ్యింది. వృద్ధురాలి జోష్ చూసిన స్టార్ యాంకర్ సుమ బామ్మతో కలిసి కాలు కదిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బామ్మ ఎనర్జీ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
జూనియర్’ సినిమా జూలై 18న కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో కిరీటి, శ్రీలీలతో పాటు రవిచంద్రన్, జెనీలియా డిసౌజా కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.