Santosh Shoban : సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కుర్ర హీరో.. సంతోష్ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనే..

చైల్డ్ ఆర్టిస్ట్ గా గోల్కొండ హై స్కూల్ సినిమాలో నటించి ఆకట్టుకున్న సంతోష్ శోభన్.. ఆ తర్వాత తాను నేను సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

Santosh Shoban : సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కుర్ర హీరో.. సంతోష్ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనే..
Santhosh Shobhan

Edited By:

Updated on: Feb 23, 2022 | 6:08 PM

Santosh Shoban : చైల్డ్ ఆర్టిస్ట్ గా గోల్కొండ హై స్కూల్ సినిమాలో నటించి ఆకట్టుకున్న సంతోష్ శోభన్.. ఆ తర్వాత తాను నేను సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ మూవీ తరవాత పేపర్ బాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంతోష్. పేపర్ బాయ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచి తూచి సినిమాలు చేస్తున్నాడు ఈ కుర్ర హీరో.. ఇటీవల ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న సంతోష్.. వెబ్ సిరీస్‌‌‌లతోనూ ఆకట్టుకుంటున్నాడు. బేకర్ అండ్ బ్యూటీ అనే వెబ్ సిరీస్‌తో సంతోష్ డిజిటల్‌లోనూ అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా అంది వచ్చిన ఆఫర్లను చేసుకుంటూ ఈ యువ హీరో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు.

అందులో ఒకటి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. రీసెంట్‌గా నితిన్‌తో మాస్ట్రో సినిమా తెరకెక్కించిన మేర్లపాక గాంధీ.. ఇప్పుడు సంతోష్‌తో ఓ ఇంట్రస్టింగ్ కథను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా సైలెంట్‌గా సాగుతోంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సింపుల్‌గా షూటింగ్‌ను ముగించే ప్రయత్నాలు చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి ప్రాంతంలో ముగించుకొని హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారట. సంతోష్ శోభన్ గత చిత్రం ఏక్ మినీ కథకు మేర్లపాక గాంధీ కథను అందించాడు. ఇప్పుడు దర్శకుడిగా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ను ముగించి ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారట. మరి ఈ సినిమా సంతోష్ కు లాంటి హిట్ అందిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై రామ్‌ చరణ్‌ ఏమన్నారో తెలుసా.? మెగా రివ్వ్యూ..

‘మాంగళ్యం తంతునానేనా మన లైఫ్ లో ఇది జరుగునా’.. ఆడవాళ్లు మీకు జోహార్లు కొత్త సాంగ్‌ విన్నారా.?

Keerthy Suresh: సూపర్ స్టైలీష్ లుక్‌లోఫ్యాన్స్ గుండెలను కొల్లగొడుతున్న కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్

Loading...
Unable to load recommendations.
Follow Us