ఈ ఏడాది యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ – రష్మిక మందన్న జంటగా నటించిన ‘యానిమల్’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పై పలు విమర్శలు వచ్చినా.. సినిమా పెద్ద సంఖ్యలో జనాలకు నచ్చిందనడానికి బాక్సాఫీస్ కలెక్షన్లే నిదర్శనం. ‘యానిమల్’ సినిమాలో ఎక్కువ హింస, స్త్రీలను అగౌరవపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని అదేవిధంగా మహిళలపై హింసను ప్రోత్సహిస్తోందని పలు విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా, సినిమాలో విలన్‌ను ముస్లింగా చేసి ముస్లింలను చెడ్డవారిగా చిత్రీకరించే ప్రయత్నం దర్శకుడు చేశాడని కూడా విమర్శలు వచ్చాయి. దీనిపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు.
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. సినిమాలో విలన్‌గా ముస్లిం వ్యక్తి చేయడానికి కారణం ఉంది. సమాజంలో క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారడం చూస్తున్నాం కానీ హిందూ మతంలోకి మారడం తక్కువ. ఇస్లాంలో ఎక్కువ మందిని వివాహం చేసుకోడం కూడా అనుమతించబడుతుంది. కాబట్టి, అదే కారణంతో, నేను విలన్‌ను ముస్లింగా చూపించాను. అంతే తప్ప ముస్లిం ప్రజలను చెడుగా చిత్రీకరించడం వల్ల కాదు.
సినిమాలో రష్మిక, రణబీర్ పాత్రలు కులాంతర వివాహం చేసుకోవడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. ”ఢిల్లీలో స్థిరపడిన తమిళ, తెలుగు కుటుంబాలను చాలా చూశాను. అలాగే వ్యక్తిగతంగా నాకు మతాంతర, కులాంతర వివాహాలు అంటే ఇష్టం కాబట్టి కథను అలానే తయారు చేశాను. అలాగే ఈ సినిమాలో రణ్‌బీర్, రష్మిక కుటుంబ సభ్యుల ముందు గాఢంగా ముద్దుపెట్టుకునే సన్నివేశం ఉంది. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. ‘‘ఆ సీన్ వస్తే బ్యాక్ గ్రౌండ్ లో రాక్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఆ సంగీతానికి ఒక రకమైన డోంట్ కేర్ ఫీల్ ఉంది. రెండు పాత్రలు ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. ఆ ముద్దులో నిన్ను మేం పట్టించుకోం అనే ఫీలింగ్ కూడా ఉంది. డిసెంబర్ 1న ‘యానిమల్’ సినిమా విడుదలై ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి ,అనిల్ కపూర్, శక్తి కపూర్ మరికొందరు సీనియర్ నటులు కూడా ఉన్నారు. క్రిటికల్ రివ్యూలు వచ్చినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.