Samantha Ruth Prabhu: మరోసారి అనారోగ్యానికి గురైన సమంత.. గొంతు కూడా పోయిందంటూ ట్వీట్

|

Apr 12, 2023 | 6:19 PM

మొన్నామధ్య సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ వ్యాధితో కొద్దిరోజులు పోరాడింది సమంత. సరైన చికిత్స తీసుకొని ఇటీవలే కోలుకుంది సమంత.

Samantha Ruth Prabhu: మరోసారి అనారోగ్యానికి గురైన సమంత.. గొంతు కూడా పోయిందంటూ ట్వీట్
Samantha
Follow us on

టాలీవుడ్ అందాల భామ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడాకుల తర్వాత ఈ అమ్మడు ఎక్కువగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే మొన్నామధ్య సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ వ్యాధితో కొద్దిరోజులు పోరాడింది సమంత. సరైన చికిత్స తీసుకొని ఇటీవలే కోలుకుంది సమంత. ప్రస్తుతం తాను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అయితే సమంత మరోసారి అనారోగ్యానికి గురైందని తెలుస్తోంది. తాజాగా సమంత షేర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తాను అనారోగ్యానికి గురయ్యానని తెలిపింది సామ్.

‘వారం రోజులుగా మీ మధ్య ఉంటూ నా సినిమా ప్రమోట్ చేస్తూ.. మీ ప్రేమలో మునిగి తేలుతున్నందుకు ఆనందంగా ఉంది. బిజీ షెడ్యూల్, శాకుంతలం ప్రమోషన్ల కారణంగా నేను జ్వరంతో భాదపడుతున్నాను. నా గొంతును కూడా కోల్పోయాను’ అని ట్వీట్ చేశారు సమంత

సమంత రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు శాకుంతలం అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతోంది సామ్. ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యానికి గురైంది. సామ్ హెల్త్ కండీషన్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.