హే వయ్యారి.! ఇది నువ్వేనా.. అర్జీవీ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి..

నిషా కొఠారి.. ఈ పేరు మీకు పెద్దగా గుర్తుండకపోవచ్చు. తెలుగులో సినిమాలు చేసినవి తక్కువే. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఫేమస్ అయింది రామ్ గోపాల్ వర్మ చిత్రాలతోనే.. జేమ్స్, సర్కార్, శివ వంటి చిత్రాల్లో తన అందాలతో కుర్రాళ్లకు మతిపోగొట్టింది. బాలకృష్ణతో ఈ హీరోయిన్ చేసిన.. ఆ వివరాలు..

హే వయ్యారి.! ఇది నువ్వేనా.. అర్జీవీ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి..
Actress Tollywood
Follow us

|

Updated on: Jun 17, 2024 | 11:20 AM

నిషా కొఠారి.. ఈ పేరు మీకు పెద్దగా గుర్తుండకపోవచ్చు. తెలుగులో సినిమాలు చేసినవి తక్కువే. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఫేమస్ అయింది రామ్ గోపాల్ వర్మ చిత్రాలతోనే.. జేమ్స్, సర్కార్, శివ వంటి చిత్రాల్లో తన అందాలతో కుర్రాళ్లకు మతిపోగొట్టింది. బాలకృష్ణతో ఈ హీరోయిన్ చేసిన ఒకే ఒక్క చిత్రం ‘ఒక్క మగాడు’. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అట్టర్ ప్లాప్ అయింది. కానీ ఈ మూవీలో నిషా కొఠారి మాత్రం ఎక్స్‌పోజింగ్ సీన్స్‌తో సెగలు పుట్టించింది.

ఇక ఈ భామ పర్సనల్ డీటయిల్స్ విషయానికొస్తే.. నిషా కొఠారి పశ్చిమ బెంగాల్‌లో జన్మించింది. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఫిజికల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. కాలేజ్ తర్వాత నిషా కొఠారి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళ స్టార్ హీరో మాధవన్‌‌తో కలిసి ‘జేజే’ అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పునీత్ రాజ్‌కుమార్ సరసన ‘రాజ్ ది షోమ్యాన్‌’తో శాండల్‌వుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక నెక్స్ట్ ‘దండుపాళ్యం’లో ఓ పాత్రలో మెరసింది. సినిమా ఆఫర్లు పూర్తిగా తగ్గడంతో ఈ భామ 2016లో భాస్కర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో తన ఫ్యామిలీతో సెటిల్ అయిందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం నిషా కొఠారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress 2

Actress 1

Actress

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..