Rakul Preet Singh: రెచ్చిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత పెరిగిన గ్లామర్ డోస్.. అందుకేనా..?

పెళ్లి తర్వాత గ్లామర్ తగ్గుతుందన్న అపోహను ఛేదిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో తాను ఇంకా కమర్షియల్ రేసులోనే ఉన్నానని బలంగా చెప్పేస్తోంది ఈ బ్యూటీ. అయితే ఈ గ్లామర్ స్ట్రాటజీ ఆమెకు మళ్లీ ఫుల్ ఫామ్ తెచ్చిపెడుతుందా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

Rakul Preet Singh: రెచ్చిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత పెరిగిన గ్లామర్ డోస్.. అందుకేనా..?
Rakul Preet Singh

Edited By:

Updated on: Mar 02, 2026 | 3:17 PM

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోషూట్స్ చూస్తుంటే కుర్రకారుకు మతిపోవడం ఖాయం. వామ్మో ఈ బ్యూటీ అస్సలు తగ్గట్లేదుగా! అని నెటిజన్లు ఆశ్చర్యపోయే స్థాయిలో ఆమె గ్లామర్ షో ఉంటోంది. రీసెంట్‌గా ఓ అవార్డు ఫంక్షన్‌కు హాజరైన రకుల్.. నెక్స్ట్ లెవల్ క్లీవేజ్ షోతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. కుమారి నుంచి శ్రీమతిగా మారిన తర్వాత రకుల్ గ్లామర్ డోస్ తగ్గిస్తుందేమో అనుకున్న వాళ్లందరికీ.. తన హాట్ ఫోటోషూట్స్‌తో దిమ్మతిరిగే ఆన్సర్ ఇస్తోంది. కుమారిగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు శ్రీమతిగా మారిన తర్వాతే ఆమె మరింత బోల్డ్‌గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు కాస్త పద్ధతిగా, గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉంటారనే ఒక అపోహ ఇండస్ట్రీలో ఉంది. కానీ రకుల్ ఆ రూల్‌ను బ్రేక్ చేస్తూ రెచ్చిపోతోంది.

పెళ్లి తర్వాతే ఆమె గ్లామర్ డోస్ మరింత పెంచేసిందా అన్నట్లుగా సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా హీట్ పెంచుతోంది. ఫిట్‌నెస్‌లో ఎప్పుడూ ముందుండే రకుల్, తన పర్ఫెక్ట్ ఫిగర్‌ను హైలైట్ చేస్తూ చేస్తున్న ఈ ఫోటోషూట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఏ ఈవెంట్‌కు వెళ్లినా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ రేంజ్ గ్లామర్ షో వెనుక అసలు కారణం అవకాశాల కోసమేనా? అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. నిజానికి ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రకుల్‌కు.. పెళ్లి తర్వాత మునుపటిలా ఆఫర్లు రావడం లేదనేది వాస్తవం. కొత్త హీరోయిన్ల ఎంట్రీతో కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోవడం, పైగా మ్యారీడ్ స్టేటస్ వల్ల మేకర్స్ ఆమెను యంగ్ హీరోల సరసన కమర్షియల్ రోల్స్‌కు కన్సిడర్ చేయడంలో కాస్త వెనకడుగు వేస్తుండొచ్చు.

ఈ గ్యాప్‌ను ఫిల్ చేయడానికే రకుల్ ఈ రూట్ ఎంచుకుందని అర్థమవుతోంది. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే తాను ఇంకా రేసులో ఉన్నానని.. ఎలాంటి కమర్షియల్ గ్లామర్ రోల్స్ చేయడానికైనా తను రెడీ అని మేకర్స్‌కు ఒక గట్టి సిగ్నల్ ఇవ్వడానికే రకుల్ ఈ స్ట్రాటజీ ప్లే చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది హీరోయిన్లకు ఒక పెద్ద మీడియం. అందులో యాక్టివ్‌గా ఉంటూ, ట్రెండింగ్ ఫోటోషూట్స్‌తో వార్తల్లో నిలిస్తేనే దర్శక నిర్మాతలకు గుర్తుంటారు. ఈ గ్లామర్ షోల ద్వారా నేను ఇంకా ఫిట్‌గా, హాట్‌గా ఉన్నాను.. మునుపటి కంటే మరింత గ్లామరస్‌గా కనిపిస్తాను అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. మరి ఈ గ్లామర్ షోతో రకుల్ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వస్తుందా, రేసులో నిలబడుతుందా? అంటే కాలమే సమాధానం చెప్పాలి.

సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామర్ మాత్రమే కాదు, ఒక సాలిడ్ హిట్ లేదా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ పడితేనే కెరీర్ మళ్లీ ఊపందుకుంటుంది. కానీ ప్రస్తుతానికైతే తన లేటెస్ట్ గ్లామర్ ట్రీట్‌తో మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తూ, ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ తానొక పర్ఫెక్ట్ కమర్షియల్ హీరోయిన్ మెటీరియల్ అని నిరూపించుకోవడంలో మాత్రం రకుల్ సక్సెస్ అవుతోంది. తెలుగులో మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో కూడా రకుల్‌కు మునపటిలా ఆఫర్స్ అయితే రావట్లేదు. ప్రస్తుతానికి ఫోటోషూట్లతో సరిపెట్టుకుంటున్న ఈ బ్యూటీ.. తనదైన రోజు కోసం వేచి చూస్తున్నారు.

Also Read: హనుమాన్ జంక్షన్ చిత్రానికి తొలుత అనుకున్న హీరోలు ఎవరో తెలుసా..? 

Follow Us