Puri Jagannadh : రేపు చచ్చిపోతాను అనుకొని ఈరోజు ఎలా బ్రతకాలో అలా బతికేయి.. బతికితే డేంజరస్ గానే బతకాలి

|

Jun 01, 2021 | 7:17 AM

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాల ద్వారానే కాదు పోడ్ కాస్ట్ రూపంలో తన ఆలోచనలను అందరితో పంచుకుంటున్న సంగతి తెలిసిందే.

Puri Jagannadh : రేపు చచ్చిపోతాను అనుకొని ఈరోజు ఎలా బ్రతకాలో అలా బతికేయి.. బతికితే డేంజరస్ గానే బతకాలి
Follow us on

టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాల ద్వారానే కాదు పోడ్ కాస్ట్ రూపంలో తన ఆలోచనలను అందరితో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు వివిధ విషయాలపై ఆయన స్పందిస్తూ.. తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.  ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో అందరినీ ఆకట్టుకుంటున్న పూరీ.. తాజాగా ఎలా బ్రతకాలో తెలిపారు. పూరి దృష్టిలో మనుషులు డేంజర్ గా బ్రతకాలంట. ”లివింగ్ డేంజరస్లీ ఈజ్ ది ఓన్లీ వే అని ఓషో లాంటి చాలా మంది చెప్పారు. రిస్క్ లేని జీవితాన్ని కోరుకోవద్దు. సెక్యురిటీ ఇవ్వమని జీవితాన్ని అడగవద్దు. ఎలాంటి ఎత్తుపల్లాలు లేని మైదానంలో బతకాలని అనుకుంటారు అందరూ. కానీ జీవితంలో ఎత్తైన కొండలు పర్వతాలు లోయలు అనేవి ఉండాలి. రిస్క్ తీసుకోవడం.. రిస్క్ లోకి దూకడమే మన క్యారెక్టర్ అవ్వాలి. చేసే పనులెప్పుడూ ఒకే విధంగా ఉండకూడదు. అలా ఉంటే బోరింగ్ గా ఉంటుంది . జీవితమనే కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగించేద్దాం. అటు నుంచి మాత్రమే ఎందుకు కాల్చాలి. ఇటునుంచి కాల్చకూడదా అనే ఆలోచనా విధానం మనిషికి అవసరం.

స్కై డైవింగ్ భయమైతే అదే చేసేయ్. ఎన్నిసార్లు దువ్వుతావ్ అదే హెయిర్ స్టైల్ ని. ఒకసారి గుండు గీసి చూడు మనశ్శాంతిగా ఉంటుంది. నువ్వు ఎప్పుడూ వేయని బట్టలు వేసుకో. ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకొని రోడ్ మీద నిలబడు. సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ చేసి ట్రావెల్ కి బయల్దేరు. తక్కువ డబ్బుతో ఎలా బ్రతకాలో నేర్చుకో..నీకు ఇష్టమైంది చేసేయ్. ఇష్టంగా చేసేయ్. ఏదైతే అది అవుద్ది. తర్వాత చూసుకుందాం. రేపు చచ్చిపోతాను అనుకొని ఈరోజు ఎలా బ్రతకాలో అలా బతికేయి. జీవితాన్ని ఎప్పుడూ దూరం నుంచి చూడొద్దు.. బాగా తిను. ఆరోగ్యంగా ఉండు. రెండు రోజులు నిన్ను నువ్వు పొగుడుకోవడం మానేయి. టాలెంటెడ్ పీపుల్ ని అభినందించు. జీవితమంటే మనం ఒక్కరం మాత్రమే కాదు. మన చుట్టూ చాలామంది ఉంటారు. వాళ్లందర్నీ చూడు.. వాళ్లకంటే డేంజరేస్ గా ఏదైనా చేయగలవేమో ఆలోచించు.  కాసేపు ప్రేమించడం మానేయి. నీకు ఎవరూ లేరనుకో. నువ్వు అనాధవి అనుకో. లైఫ్ అంటేనే ఎన్నో సాహసాలతో నిండింది. బతికితే డేంజరస్ గానే బతకాలి. మొనాటనస్ లైఫ్ మనకొద్దు. లివ్ డేంజరస్లీ అంటూ చెప్పుకొచ్చారు పూరీ.

మరిన్ని ఇక్కడ చదవండి :

అర్ధరాత్రి నా కారును నలుగురు దుండగులు వెంబడించారు.. అది చాలా భయంకరమైన రోజు.. చేదు అనుభవాన్ని చెప్పిన నటి..