బ్యాచిలర్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.. సిరీస్ అదిరిపోయింది..! జబర్దస్త్ బాబు‌పై బడా నిర్మత ప్రశంసలు..

గత కొద్దీ రోజుల నుంచి ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సీరీస్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్క దెబ్బకు జబర్దస్త్ ఫేమ్ డేగల బాబు జీవితం కూడా మారిపోయింది. ఎందుకంటే, తను డైరెక్ట్ చేసిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ రికార్డ్స్ మీద రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది

బ్యాచిలర్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.. సిరీస్ అదిరిపోయింది..! జబర్దస్త్ బాబు‌పై బడా నిర్మత ప్రశంసలు..
Babu

Updated on: Oct 17, 2026 | 7:15 PM

సినిమా రంగంలో ప్రతిభ ఉన్నవారికి ప్రోత్సాహం అందించడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా కమెడియన్లుగా ప్రేక్షకులను నవ్వించిన వారు దర్శకులుగా మారి తమ ప్రతిభను నిరూపించుకోవడం ఆసక్తికరమైన విషయం. ఇప్పటికే చాలా మంది దర్శకులుగా, నటులుగా రాణిస్తున్నారు. వేణు, ధన్ రాజ్, అదిరే  అభి లాంటి వారు దర్శకులుగా మారి సినిమాలు, సిరీస్ లు తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ బాబు కూడా దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాబు తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై నవ్వులు పంచిన ఆయన, సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కమెడియన్ గా మాత్రమే కాకుండా దర్శకత్వం వైపు అడుగులు వేయడం ఆయన కెరీర్‌లో ఆసక్తికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు.

బుల్లితెరపై ప్రేక్షకులను నవ్వించడం ఒక ఎత్తయితే, సినిమా మాధ్యమంలో కథను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించడం మరో ఎత్తు. ఈ రెండు రంగాల్లోనూ రాణించాలంటే ప్రతిభతో పాటు కష్టపడే తత్వం కూడా అవసరం. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన కళాకారులు సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో బాబు డేగల ప్రయాణం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాబు మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఈటీవీ విన్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. కాగా దర్శకుడు బాబు పై ప్రశంసలు కురించారు నిర్మాత ఎస్‌కేఎన్

టాలీవుడ్‌లో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్‌కేఎన్ కొత్త ప్రతిభను ప్రోత్సహించే విషయాల్లో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బాబు డేగలను ఆయన అభినందించారు ఎస్.కేఎన్. సిరీస్ అద్భుతంగా ఉందని ప్రతి ఒక్క బ్యాచిలర్ కు కనెక్ట్ అయ్యేలా ఈ సిరీస్ ఉందని అన్నారు ఎస్.కేఎన్. ఫుల్ మీల్ ఎంటర్టైనర్ అంటూ ప్రశంసలు గురించారు ఎస్.కేఎన్. దర్శకుడిగా బాబు డేగల మరిన్ని మంచి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us