బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తోన్న నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్టు ‘ది వైట్ టైగర్’. భారత రచయిత అరవింద్ అడిగా రాసిన ‘ది వైట్ టైగర్’ నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు హాలీవుడ్ దర్శకుడు రమిన్ బహ్రాని. తాజాగా ఈ సిరీస్ షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని ఫొటోలను ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ది వైట్ టైగర్ ఫస్ట్ లుక్ ను అందిస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొంది. ది వైట్ టైగర్ న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా నిలిచిందని, 2008లో బ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకుందని పేర్కొంది. కాగా ఈ సినిమాలో పింకీ అనే పాత్రలో కనిపించనున్నారు ప్రియాంక. ( దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్‌కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై ! )
లక్ష్మణ్ గఢ్ (రాజస్థాన్)గ్రామానికి చెందిన బల్ రామ్ హల్వాయ్ అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథాంశంతో ది వైట్ టైగర్ నవల కొనసాగుతుంది. ‘ది వైట్ టైగర్’ లో రాజ్ కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమెరికన్ సింగర్ నినిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక ఇండియన్ మూవీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ( ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు ! )