Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ గోల్డెన్ ఛాన్స్.. ఆ స్టార్ హీరో సినిమాలో మమిత

|

Oct 03, 2024 | 9:16 AM

అలా వచ్చిన సినిమాల్లో ప్రేమలు మూవీ ఒకటి. మలయాళంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజు కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ అమ్మడు తన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది.

Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ గోల్డెన్ ఛాన్స్.. ఆ స్టార్ హీరో సినిమాలో మమిత
Mamitha Baiju
Follow us on

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కథను నమ్ముకొని తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. దాంతో ఆ సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలా వచ్చిన సినిమాల్లో ప్రేమలు మూవీ ఒకటి. మలయాళంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజు కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ అమ్మడు తన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రేమలు సినిమా హిట్ అవ్వడంతో పాటు మమిత కూడా క్లిక్ అవ్వడంతో ఇప్పుడు ఈ బ్యూటీకి వరస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో మమిత నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఈ అమ్మడు చోటు దక్కించుకుందని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు దళపతి విజయ్. దళపతి విజయ్ హీరోగా రీసెంట్ గా గోట్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది.

ఇదిలా ఉంటే విజయ్ లాస్ట్ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు టెంపరరీగా విజయ్ 69 అని పేరు పెట్టారు. కాగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ గా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో మమిత బైజు కూడా నటిస్తుందని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో మమిత విజయ్ సోదరిగా కనిపిస్తుందని టాక్. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కె సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. 2025 అక్టోబర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని మేకర్స్ చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.