Prabhas: హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన బాహుబలి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు

| Edited By: Rajitha Chanti

May 01, 2021 | 9:32 AM

ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ లో తన పార్ట్ ను పూర్తి చేసాడు డార్లింగ్. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

Prabhas: హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన బాహుబలి.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు
Prabhas
Follow us on

Prabhas:

ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ లో తన పార్ట్ ను పూర్తి చేసాడు డార్లింగ్. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే సినిమా కూడా చేస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్. ఇక డార్లింగ్ ప్రభాస్‌ న్యూ లుక్‌ వైరల్ అవుతోంది. రాధేశ్యామ్‌ షూట్‌కు బ్రేక్ పడటంతో వెకేషన్‌కు బయలు దేరారు ప్రభాస్‌. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన బాహుబలి ఫోటోస్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను కరోనా అవేర్‌నెస్‌ విషయంలోనూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

మాస్క్‌ వేసుకోవటమే కాదు హెయిర్‌ కూడా క్యాప్‌తో కవర్‌ చేసుకున్న డార్లింగ్ లుక్‌ ఇప్పుడు ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా కనిపించేందుకు స్లిమ్‌ లుక్‌లోకి మారిపోయారు ప్రభాస్‌. లేటెస్ట్ ఫోటోస్‌లోనూ అదే లుక్‌లో కనిపించటంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

ప్రజెంట్ ఆదిపురుష్‌తో పాటు సలార్‌, రాధేశ్యామ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు ప్రభాస్‌. ఈ మూడు సినిమాల షూటింగ్‌కు కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా బ్రేక్‌ పడింది. హెక్టిక్‌ షెడ్యూల్స్‌ మధ్య టైర్డ్ అయిన ప్రభాస్‌.. ఈ బ్రేక్‌లో రిలాక్స్ అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral News: అస‌లైన హీరో ఇత‌డేగా.. మ‌న‌సు చ‌లించి అంబులెన్స్ డ్రైవర్​గా మారిన నటుడు..

భారతి అనే మహిళను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సోనుసూద్..! ఎందుకో మీరే తెలుసుకోండి..?

Samantha: `ఈ క‌ష్ట స‌మ‌యంలో మ‌నంద‌రం క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఉంది`.. మ‌రో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన సామ్‌..