Kalki 2898 AD : కల్కి సినిమా రన్ టైమ్ ఫిక్స్..? ప్రభాస్ కోసం అంత టైమ్ వెయిట్ చేయాల్సిందే..

|

Jun 03, 2024 | 4:51 PM

ఇక ఇటీవల విడుదలైన బుజ్జి వీడియో సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించింది. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తుండగా.. అతడి జీవితంలో అతి ముఖ్యమైన బుజ్జి కారును ఇటీవల రివీల్ చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం బుజ్జి కారు దేశంలోని పలు నగరాల్లో చక్కర్లు కొడుతుంది.

Kalki 2898 AD : కల్కి సినిమా రన్ టైమ్ ఫిక్స్..? ప్రభాస్ కోసం అంత టైమ్ వెయిట్ చేయాల్సిందే..
Kalki 2898 AD movie
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ సినిమా కల్కి 2898 ఏడీ. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్డెట్ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. భారతీయ ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన బుజ్జి వీడియో సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించింది. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటిస్తుండగా.. అతడి జీవితంలో అతి ముఖ్యమైన బుజ్జి కారును ఇటీవల రివీల్ చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం బుజ్జి కారు దేశంలోని పలు నగరాల్లో చక్కర్లు కొడుతుంది.

మరోవైపు ఓటీటీలో బుజ్జి భైరవ యానిమేషన్ సిరీస్ దూసుకుపోతుంది. అసలు కల్కి 2898 ఏడీ సినిమా ఏంటీ.. ? భైరవ జీవితంలో బుజ్జి ఎందుకంత ప్రత్యేకంగా మారింది అనే విషయాలను తెలుపుతూ ఈ యానిమేషన్ సిరీస్ తీసుకువచ్చారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా కల్కి ప్రాజెక్ట్ రన్ టైమ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
ఇదిలా ఉంటే.. కల్కి అడ్వాన్స్డ్ బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. యూఎస్ లో జూన్ 8 నుంచి బుకింగ్స్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. దీంతో ప్రీ సేల్స్ కు సంబంధించి ఈ చిత్రం యూఎస్ డిస్ట్రిబ్యూటర్ తాజాగా ఓ పోస్ట్ పెట్టగా.. అందులో సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉంది. దీంతో రన్ టైమ్ కాస్త ఎక్కువే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‏గా ఉంటే నిడివి ఎంత ఉన్నా చూడొచ్చు అంటూ ప్రభాస్ ఫ్యా్న్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కల్కి ప్రాజెక్ట్ రన్ టైమ్ పై ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ ప్రకటించలేదు.

ఈ భారీ బడ్జెట్ మూవీలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.