Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ రీఎంట్రీకి ఏడాది

|

Apr 09, 2022 | 9:44 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే..

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్  రీఎంట్రీకి ఏడాది
Pawan Kalyan
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. థియేటర్స్ దగ్గర జాతరే.. పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, రక్తదానాలు, అన్నదానాలు.. హడావిడి మాములుగా ఉండదు. స్టైల్ తో యాక్టింగ్ తో యాటిట్యూడ్ తో భారీ ఫ్యాన్స్ పాలోయింగ్ ను సొంతం చేసుకున్న పవర్ స్టార్.. బయట తన సింపుల్ సిటీ తో నిజాయితితో భక్తులను సొంతం చేసుకున్నారు. మారే హీరోకు లేని విధంగా పవన్ కు భక్తులు ఉన్నారు. ఆ మధ్య సినిమాలకు దూరం అవుతున్నా ప్రజా సేవ కోసం అంకితం అవుతున్నా అంటూ పవన్ ఇచ్చిన స్టేట్ మెంట్ అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. ఇక తమ హీరోను పెద్ద తెరపై చూడలేమా అన్న నిరాశ నిస్పృహ అభిమానుల్లో కనిపించింది. ఇంతలోనే పవన్ రీ ఎంట్రీ అంటూ వచ్చిన వార్త పవర్ స్టార్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపింది.

వకీల్ సాబ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. దాదాపు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’మూవీలో రీ ఎంట్రీ ఇచ్చి న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌ 9న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. నేటితో ఈ సినిమా 1 ఇయర్ పూర్తి చేసుకుంది. తక్కువ సమయంలోనే దాదాపు రూ.80 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పవన్‌ సత్తా ఏంటో నిరూపించింది. ఇక థియేటర్స్ లో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో హల్ చల్ చేస్తుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వకీల్ సాబ్ సినిమా అక్కడ కూడా భారీ వ్యూస్ ను రాబడుతుంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా భీమ్లానాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు పవన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Yami Gautam: ‘నన్ను దిగజార్చాలని చూస్తున్నారు, నా హృదయం ముక్కలయ్యింది’.. ఆవేదన వ్యక్తం చేసిన బాలీవుడ్‌ బ్యూటీ.

RRR Movie: టాలీవుడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోన్న ఆర్ఆర్ఆర్.. వెయ్యి కోట్లను దాటేస్తూ..

Viral Photo: ఎల్లోరా శిల్పం.. అందాల నయాగారం.. ఓర చూపులు చూస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా!