Pawan Kalyan: పవర్ స్టార్ ‘పంజా’ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?

|

Sep 20, 2022 | 9:40 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతోపాటు అటు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చిన పవన్ బీమ్లానాయక్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

Pawan Kalyan: పవర్ స్టార్ పంజా సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?
Panja
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇటు సినిమాలతోపాటు అటు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చిన పవన్ బీమ్లానాయక్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే హరిహరవీరమల్లు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే పవన్ నటించిన పంజా సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవర్ స్టార్ నటించిన పంజా సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. సినిమాలో పవన్ నటన, ఆయన లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పవన్ స్టైలిష్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు.తమిళ్ దర్శకుడు విష్ణువర్ధన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2011 సంవత్సరంలో డిసెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ముందుగా అనికున్న టైటిల్ పంజా కాదట. ఈ సినిమాకు ముందు ది షాడో అనే టైటిల్ ను అనుకున్నారట. కథకు ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని భావించిన దర్శకనిర్మాతలు అదే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ చేశారు. కానీ చివరిలో పంజా అనే టైటిల్ ను ఖరారు చేశారు. పంజాతోపాటు..  పటేల్, తిలక్, కాళీ, పవర్ అనే టైటిల్స్ కూడా పరిశీలించారట. ఫైనల్ గా పంజా అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. ఇక ఈ సినిమాలో హీరోయిన్ నటన మైనస్ అయ్యింది. అలాగే కథ కూడా అంతగా ప్రేక్షకులకు ఎక్కలేదు.. పంజా కంటే ముందే పవన్ బాలు అని ఇదే తరహా కథ చేశారు. మొత్తానికి సినిమా ఎలా ఉన్న పవన్ నటన, ఆయన లుక్ మాత్రం సూపర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఇవి కూడా చదవండి