Pawan Kalyan: గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న అన్నా లెజినోవా.. భార్యతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ..

|

Jul 20, 2024 | 7:39 PM

అన్నా లెజినోవా పట్టా తీసుకోవడానికి వెళ్తుండగా.. వెనకాలే పవన్ నడుస్తున్న ఫోటోస్ చూసి ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సింగపూర్ లో కూడా పవన్ స్టైల్, స్వాగ్ అసలు మారలేదు అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అలాగే పవన్ భార్య అన్నా లెజినోవాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ సెర్మనీకి హాజరయ్యారు. సింగపూర్‏ యూనివర్సిటీలో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ డిగ్రీ పట్టా అందుకున్నారు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‏లో ఆమె ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ ,సోషల్ సైన్సెస్) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా… పట్టా అందుకున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించింది. అన్నా లెజినోవా పట్టా తీసుకోవడానికి వెళ్తుండగా.. వెనకాలే పవన్ నడుస్తున్న ఫోటోస్ చూసి ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సింగపూర్ లో కూడా పవన్ స్టైల్, స్వాగ్ అసలు మారలేదు అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అలాగే పవన్ భార్య అన్నా లెజినోవాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందిన సతీమణికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తన భార్యతో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకు ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నారు అన్నా లెజినోవా. అలాగే బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్‌లో మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

2011లో వచ్చిన తీన్ మార్ సినిమాలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లింది. 2013లో వీరిద్దరి మ్యారెజ్ కాగా.. వీరికి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఉన్నాడు. రష్యాకు చెందిన అన్నా లెజినోవా మోడల్ గా కెరీర్ ప్రారంభించి పలు చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ తో వివాహం జరిగిన తర్వాత భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నారు అన్నా. ఎక్కడకు వెళ్లిన చీరకట్టులోనే కనిపిస్తుంటారు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.