NTR Releasing Uppena Trailer: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.
దిగ్గజ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ డైరకెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అంతేకాకుండా అందుకు తగినట్లుగానే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ఫొటోలు, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక చిత్ర యూనిట్ కూడా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి పబ్లిసిటీ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా లిరికల్ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమాను ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ ట్రైలర్ విడుదల చేసే పనిలో పడింది. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ టైగర్, నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ ఇప్పటికే.. సినిమా ట్రైలర్ విడుదల పోస్టర్‌ను విడుదల చేస్తూ.. క్యురియాసిటీని పెంచేసింది.
Also Read: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో.. రియల్ హీరో కోసం విలన్‌గా మారుతున్న స్టార్..