Keerthy Suresh : కనిపించకుండాపోయిన కీర్తిసురేష్ .. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హీరో.. స్పందించిన హైదరాబాద్ సిటీ పోలీసులు

మహా నటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపుతెచ్చుకున్న నటి కీర్తి సురేష్. ఆ ముద్దుగుమ్మ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఒకవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూనే

Keerthy Suresh : కనిపించకుండాపోయిన కీర్తిసురేష్ .. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన  హీరో.. స్పందించిన హైదరాబాద్ సిటీ పోలీసులు
Keerthi Suresh

Updated on: Mar 20, 2021 | 8:01 PM

Keerthy Suresh : మహా నటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపుతెచ్చుకున్న నటి కీర్తి సురేష్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఒకవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూనే.. మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోను మెప్పిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న రంగ్ దే సినిమా ఒకటి. వెంకీ అట్లూరిదర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది.

అయితే కీర్తి సురేష్ సడన్ గా కనిపించకుండా పోయిందని నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కీర్తి సురేష్ చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసిన నితిన్ మిస్సింగ్ , కనబడుటలేదు.. “డియర్ అను.. నువ్వు ఎక్కడ ఉన్న రంగ్ దే ప్రమోషన్స్ లో జాయిన్ అవ్వాలని మా కోరిక ఇట్లు నీ అర్జున్” అని రాసుకొచ్చాడు నితిన్. ఇప్పుడు ఈపోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్ట్ పైన హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. ఆందోళన పడకండి నితిన్ మేము చూసుకుంటాం అంటూ పోలీసులు కూడా ఫన్నీగా రీప్లే ఇచ్చారు.

ఇదిలా ఉంటే కీర్తి సురేష్, నితిన్ ఇద్దరు రంగ్ దే సినిమా షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేశారు. షూటింగ్ సమయంలో జరిగిన ఫన్నీ విషయాలను ఇద్దరు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. తాజాగా నితిన్ కీర్తిని ఏడిపిస్తూ ఇలా పోస్ట్ చేసాడు. ఇక రంగ్ దే సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మంచి సంగీతాన్నిఅందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Singer Sunitha: పుత్రికోత్సాహంలో సింగర్ సునీత.. అందమైన పాటపాడిన శ్రేయ.. వీడియో వైరల్

Yuvarathnaa Trailer : ఆకట్టుకుంటున్న యువరత్న ట్రైలర్.. అదరగొట్టిన పునీత్ రాజ్

Sai Pallavi : సమ్మర్ స్పెషల్ గా సాయిపల్లవి .. రెండు సినిమాలతో పలకరించనున్న ఫిదా బ్యూటీ

Loading...
Unable to load recommendations.
Follow Us