Netflix: ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఇక పై నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీగా సినిమాలు, సిరీస్లు చూడొచ్చు..

|

Jun 26, 2024 | 6:58 PM

ఓటీటీ సంస్థలు పెరిగాయి..దాంతో ఓటీటీ కంటెంట్ కూడా పెరిగింది. ప్రతి శుక్రవారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలు నెల రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్ లకు కొదవే లేదు.

Netflix: ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఇక పై నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రీగా సినిమాలు, సిరీస్లు చూడొచ్చు..
Netflix
Follow us on

కరోనా పుణ్యమా అని ఓటీటీల వాడకం ఎక్కువైంది. లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ కు వెళ్లలేక చాలా మంది ఓటీటీలో సినిమాలు చూడటం మొదలు పెట్టారు. అలా మెల్లగా సినిమాలు థియేటర్స్ లో చూడటం కంటే ఓటీటీల్లోనే చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు ఆడియన్స్. ఓటీటీ సంస్థలు పెరిగాయి..దాంతో ఓటీటీ కంటెంట్ కూడా పెరిగింది. ప్రతి శుక్రవారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలు నెల రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్ లకు కొదవే లేదు. చాలా రకాల వెబ్ సిరీస్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు అలరిస్తున్న ఓటీటీ సంస్థల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నెట్‌ఫ్లిక్స్ గురించే..

నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటికే చాలా రకాల సినిమాలు ఉన్నాయి. హాలీవుడ్ కంటెంట్ తో పాటు తెలుగు కంటెంట్ కూడా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ప్రముఖ సినిమాలు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్ లోనే స్త్రీమింగ్ అవుతుంటాయి. అలాగే ఓన్లీ నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్ లు కూడా చాలా ఉన్నాయి. అయితే సబ్ స్క్రిప్షన్ తీసుకుంటేనే నెట్ ఫ్లిక్స్ లో కంటెంట్ చూడొచ్చు.. కానీ ఇప్పుడు ఫ్రీగా కంటెంట్ చూసే వెసులుబాటు కలిపిస్తుందట నెట్‌ఫ్లిక్స్. అదెలా అంటే..

ప్రస్తుతం ఉన్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెట్ అందిచడంతో పాటు ప్రేక్షకులు మెచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు అందించడంలో నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. యూరప్, ఆసియాలోని ప్రేక్షకులను టార్గెట్ గా చేసుకొని నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు కొత్త ప్లాన్ తీసుకు వస్తుందని తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ను ఇండియాకు తీసుకు వస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుండానే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోని సినిమాలు, వెబ్ సిరీసులను ఉచితంగా చూడొచ్చట.. అయితే వీటిలో యాడ్స్ ఎక్కువ వస్తాయట.. 20 నిమిషాలకు ఓ యాడ్, లేదా అరగంటకు ఓ యాడ్ వస్తుందట. అడ్వర్టైజ్‌మెంట్స్‌తోనే ఉచితంగా వీక్షించవచ్చని తెలుస్తోంది. యాడ్స్ లేకుండా సినిమాలు, సిరీస్ లు చూడటానికి డబ్బులు కట్టి సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలట. ఈ కొత్త ప్లాన్ ను త్వరలోనే యూరప్, ఆసియాలో తీసుకురానున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ ఫ్రీ ప్లాన్ ఇండియా కు వస్తుందేమో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..