తెలుగు పాటకు దుమ్మురేపిన నేపాలీ పాపలు.. ఏమాటకామాట ఇరగదీశారు.!

తెలుగు సినిమాలు ఈ మధ్య గ్లోబల్ రేంజ్ లో సందడి చేస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో మన సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అలాగే కలెక్షన్స్ లోనూ కుమ్మేస్తున్నాయి మన సినిమాలు. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా సంచలన విజయం సాధించడం తో పాటు భారీగా కలెక్షన్స్ రాబట్టింది.

తెలుగు పాటకు దుమ్మురేపిన నేపాలీ పాపలు.. ఏమాటకామాట ఇరగదీశారు.!
Tollywood

Updated on: Jan 25, 2025 | 8:21 AM

తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుగు సినిమాల వైపే చూస్తుంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తూ.. రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి మన సినిమాలు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు.. హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను మెచ్చుకున్నారు. అలాగే రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా పాన్ ఇండియాను షేక్ చేసింది. రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది ఈ సినిమా. దాంతో ఎక్కడ చూసిన మన సినిమా గురించే చర్చ.. అంతే కాదు మన సినిమా సాంగ్స్ కు కూడా అదే రేంజ్ లో క్రేజ్ వస్తుంది. మన పాటలకు ప్రపంచం మొత్తం షేక్ అవుతుంది.

ఇప్పటికే మన తెలుగు సాంగ్స్ కు విదేశాల్లో డాన్స్ లు వేయడం, పాడటం వంటివి చేస్తున్నారు. ఇందుకు సంబందించిన వీడియోలను మనం నెట్టింట ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం.. తాజాగా మరోసారి మన తెలుగు పాటకు విదేశీ యువత డాన్స్ తో ఆకట్టుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతే కాదు ఈ సాంగ్ లో మహేష్ బాబు, శ్రీలీల డాన్స్ తో ఇరగదీశారు.

ఇక ఇదే పాటకు ఇప్పటికే చాలా మంది రీల్స్, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. తాజాగా నేపాల్ అమ్మాయిలు మహేష్ సాంగ్ కు ఆడిపోయే డాన్స్ వేశారు. కూర్చిమడతపెట్టి సాంగ్ కు స్టెప్పులేశారు నేపాలీ అమ్మాయిలు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోను మహేష్ బాబు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఏమాటకామాట అమ్మాయిలు నిజంగానే ఇరగదీశారు.. మీరు ఆ వీడియో పై ఓ లుక్కేయండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.