69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ విజేతలను గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించనున్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జ్యూరీ విలేకరుల సమావేశంలో గురువారం చలనచిత్ర అవార్డ్స్ విజేతలను ప్రకటించనున్నారు. ఈ అవార్డ్స్ కోసం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేషనల్ అవార్డ్స్ రేసులో టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే ఉత్తమ నటి అవార్డ్ రేసులో అలియా భట్, కంగనా రనౌత్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కోలీవుడ్ నుంచి జోజు జార్జ్, సూర్య, ఆర్ మాధవన్, మిన్నాల్ మురళి పేర్లు వినిపిస్తున్నాయి. జాతీయ చలనచిత్ర అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. వీటిని దేశవ్యాప్తంగా ఉత్తమ చిత్రనిర్మాణ ప్రతిభను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఉత్తమ చిత్రం హిందీ.. రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్..
ఉత్తమ దర్శకుడు.. నిఖిల్ మహాజన్ (గోదావరి-మరాఠీ)
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్.. కింగ్ సాలమన్ (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ స్క్రీన్ ప్లే.. నాయట్టు (మలయాళం)
బెస్ట్ ఫిల్మ్ ఫ్యామిలీ వ్యాల్యూస్.. చాంద్ సాన్సే
ఉత్తమ సహాయ నటులు.. పల్లవి జోషి (ది కాశ్మీర్ ఫైల్స్), పంకజ్ త్రిపాఠి (మిమి) ఉత్తమ సహాయ నటులుగా ఎంపికయ్యారు
గంగూబాయి కతియావాడి, మిమీ చిత్రాలకు గానూ అలియా భట్, కృతి సనన్ ఉత్తమ నటీమణులుగా అవార్డ్ గెలుచుకున్నారు.
ఉత్తమ సినీ గేయ రచయిత.. చంద్రబోస్.. కొండపొలం సినిమాకు గానూ.
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్.. కాళభైరవ.. ఆర్ఆర్ఆర్ సినిమాకు.
ఉత్తమ నటుడిగా పుష్ప చిత్రానికిగానూ అల్లు అర్జున్.
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్.. పుష్ప.. దేవీ శ్రీ ప్రసాద్.
బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ. ఆర్ఆర్ఆర్..
బెస్ట్ కొరియోగ్రఫీ.. ఆర్ఆర్ఆర్..
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ క్రియేటర్.. ఆర్ఆర్ఆర్..
ఉత్తమ హిందీ సినిమా సర్దార్ ఉదమ్..
బెస్ట్ గుజరాతీ సినిమా చల్లో షో..
బెస్ట్ కన్నడ ఫిల్మ్ 777 చార్లీ..
బెస్ట్ మైథిలీ ఫిల్మ్.. సమానంతర్..
బెస్ట్ మరాఠీ ఫిల్మ్.. ఏక్దా కాయ్ జాలా..
బెస్ట్ మలయాళం ఫిల్మ్.. హోమ్..
బెస్ట్ మేథిలియాన్ ఫిల్మ్.. eikhoigi yum (our home)
బెస్ట్ ఓడియా ఫిల్మ్.. ప్రతీక్ష(the wait)
బెస్ట్ తమిళ్ ఫిల్మ్.. కదైసి వ్యవసాయి (ది లాస్ట్ ఫార్మర్)
బెస్ట్ తెలుగు ఫిల్మ్.. ఉప్పెన
బెస్ట్ తెలుగు ఫిల్మ్.. ఉప్పెన (తెలుగు)
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల ప్రకటన ప్రస్తుతం జరుగుతోంది. నాన్-ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో ప్రధాన అవార్డులు.
ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ – ఏక్ థా గావ్ (గర్హ్వాలి & హిందీ)
ఉత్తమ దర్శకుడు – స్మైల్ ప్లీజ్ (హిందీ) చిత్రానికి బకువల్ మతియాని
కుటుంబ విలువలపై ఉత్తమ చిత్రం – చాంద్ సాన్సే (హిందీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – పటాల్ టీ (భోటియా) చిత్రానికి బిట్టు రావత్
ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం – లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్)
ఉత్తమ ఎడ్యూకేషన్ చిత్రం – సిర్పిగాలిన్ సిపంగల్ (తమిళం)
సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం – మిథు ది (ఇంగ్లీష్), త్రీ టూ వన్ (మరాఠీ & హిందీ)
ఉత్తమ పర్యావరణ చిత్రాలు – మున్నం వలవు (మలయాళం)
బెస్ట్ నాన్ ఫిచర్ ఫిల్మ్.. ఏక్ దా గావ్.. హిందీ
బెస్డ్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డ్ పురుషోత్తమచార్యులు (తెలుగు ) అందుకున్నారు.
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ప్రకటించే ముందు, I&B అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్ మీడియాతో మాట్లాడుతూ, 28 భాషల్లో మొత్తం 280 చలనచిత్రాలు , 23 భాషలలో 158 నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు.
న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సమావేశంలో జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన ప్రారంభమైంది.
నేషనల్ ఫిల్మ్ అవార్డ్ 2023లో ఉత్తమ నటుడిగా పుష్ప చిత్రానికిగానూ అల్లు అర్జున్ అవార్డ్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 మినిట్ టూ మినిట్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూసేయ్యండి.
#WATCH | Delhi: Jury members for National Film Awards handed over the list of awardees for feature, non-feature and best script category to Union I&B Minister Anurag Thakur. pic.twitter.com/wDjhu2I87k
— ANI (@ANI) August 24, 2023
గతేడాది ఉత్తమ నటి అవార్డును హీరోయిన్ అపర్ణా బాలమురళి అందుకున్నారు. సైనా అనే హిందీ చిత్రానికి గానూ మనోజ్ ముంతాషిర్ ఉత్తమ సాహిత్యం అవార్డును గెలుచుకున్నారు. మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ అవార్డును మధ్యప్రదేశ్ గెలుచుకుంది. అలాగే కిశ్వర్ దేశాయ్ రచించిన ది లాంగెస్ట్ కిస్ సంవత్సరానికి సినిమాపై ఉత్తమ పుస్తకానికి అవార్డ్ వచ్చింది.
జాతీయ చలనచిత్ర అవార్డుల కోసం జ్యూరీ సభ్యులు ఫీచర్, నాన్-ఫీచర్, ఉత్తమ స్క్రిప్ట్ విభాగంలో అవార్డ్స్ విజేతల జాబితాను కేంద్ర I&B మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు అందజేశారు.
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 ఉత్తమ నటి అవార్డ్ కోసం అలియా భట్, కంగనా రనౌత్ మధ్య గట్టి పోటీ ఉంది. గంగూబాయి కతియావాడి చిత్రానికిగానూ అలియాకు.. ఇక తలైవి చిత్రానికిగానూ కంగనా రనౌత్ పేర్లు వినిపిస్తున్నాయి.
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డ్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ ఏడాది జైభీమ్, మిన్నల్ మురళి, తలైవి, సర్దార్ ఉదం, 83, పుష్ప ది రైజ్, షేర్షా, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, గంగూబాయి కతియావాడి, నాయట్టు వంటి అనేక సినిమాలు నేషనల్ అవార్డ్స్ కోసం పోటీ పడుతున్నాయి.
న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో జ్యూరీ విలేకరుల సమావేశంలో గురువారం చలనచిత్ర అవార్డ్స్ విజేతలను మరికొద్ది క్షణాల్లో ప్రకటించనున్నారు.