Rashmika Mandanna: రష్మికాను గన్‌తో బెదిరించిన నాని.. వణికిపోయిన అమ్మడు.. కారణం ఏంటంటే

|

May 13, 2024 | 9:43 AM

బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది రష్మిక మందన్న. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి బాలీవుడ్ లోనూ భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం రష్మిక ఒప్పుకున్నా సినిమాలన్నీ భారీ సినిమాలే..

Rashmika Mandanna: రష్మికాను గన్‌తో బెదిరించిన నాని.. వణికిపోయిన అమ్మడు.. కారణం ఏంటంటే
Nani, Rashmika
Follow us on

నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది రష్మిక మందన్న. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి బాలీవుడ్ లోనూ భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం రష్మిక ఒప్పుకున్నా సినిమాలన్నీ భారీ సినిమాలే.. ఇదిలా ఉంటే ఓ స్టార్ హారో రష్మికాను గన్ తో బెదిరించాడు. దాంతో వణికిపోయింది అమ్మడు. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరు.? ఎందుకు రష్మికాను బెదిరించాడు.? అసలు ఏం జరిగింది.?

నేచురల్ స్టార్ నాని విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్ నాన్న లాంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. కాగా నాని రష్మికాతో కలిసి ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి దేవదాస్ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో నాగార్జున కూడా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది దేవదాస్ సినిమా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున, నాని, రష్మిక , ఆకాంక్ష సింగ్ పాల్గొన్నారు.. ఈ ఇంటర్వ్యూలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. నాని రష్మికాను నీ ఫెవరెట్ కో స్టార్ ఎవరు.?  అని ప్రశ్నించాడు. దాంతో నాగార్జున కూడా రష్మికాను ఇదే ప్రశ్న అడిగారు. విజయ్ దేవరకొండ, నాగ శౌర్య , నాని ఈ ముగ్గురిలో ఎవరు నీ ఫెవరెట్ అని అడిగారు నాగ్. దానికి రష్మిక తడబడుతుంటే నాని అక్కడే టేబుల్ పై ఉన్న గన్ తో ఆమెను బెదిరించాడు. దాంతో రష్మిక నాని పేరు చెప్పింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

నాని రష్మిక ఫన్నీ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.