Bimbisara : నందమూరి హీరోకు ఈసారి హిట్టు పడేలా ఉందే.. దూసుకుపోతోన్న ‘బింబిసార’ ట్రైలర్

|

Jul 05, 2022 | 9:29 PM

నిన్నమొన్నటి వరకు లవ్, హై ఎండ్ యాక్షన్ సినిమాలతో మనల్ని ఆకట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram).. ఇప్పుడు ఫిరియాడికల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

Bimbisara : నందమూరి హీరోకు ఈసారి హిట్టు పడేలా ఉందే.. దూసుకుపోతోన్న బింబిసార ట్రైలర్
Bimbisara
Follow us on

నిన్నమొన్నటి వరకు లవ్, హై ఎండ్ యాక్షన్ సినిమాలతో మనల్ని ఆకట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram).. ఇప్పుడు ఫిరియాడికల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. పీరియాడికల్ మూవీగా రూపొందుతోన్న బింబిసార సినిమాతో తనేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. అనుకోవడమే కాదు.. సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే అప్పట్లో అందర్నీ పాక్‌ చేశారు. ఆతర్వాత వెంటనే బింబిసార టీజర్‌ ను రిలీజ్‌ చేసి నందమూరి ఫ్యాన్స్ ను షేక్ చేశారు. యూట్యూబ్ రచ్చ రచ్చ చేశారు. ఇక తాజగా రిలీజ్‌ చేసిన బింబిసార ట్రైలర్‌తో.. ఈ రచ్చను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లారు కళ్యాణ్ రామ్. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడుగా.. కలియుగంలో మళ్లీ తిరిగి వచ్చిన బింబిసారుడిగా.. డ్యూయల్ షేడ్‌లో ఈ ట్రైలర్లో కనిపించారు కళ్యాణ్ రామ్. నందమూరి వారికే సాధ్యమవుతాయి అనేలా.. పవర్‌ ఫుల్ డైలాగులతో ట్రైలర్ లోనే చప్పట్లు కొట్టించుకున్నారు కళ్యాణ్ రామ్.

ఇక కళ్యాణ్ రామ్ మోస్ట్ ప్రెస్టేజియస్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్ కు కిక్కవ్వడమే కాదు.. యూట్యబ్‌లో మంచి వ్యూస్ ను సాధించేస్తోంది. ట్రైలర్ రిలీజైన ఒక్క రోజులోనే 10 మిలియన్ వ్యూస్ ను పట్టేసింది. అంతేకాదు 246.5k వ్యూ పర్ అవర్ వ్యూ రేట్‌తో యూట్యూబ్‌ను అల్లాడిస్తోంది. సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేస్తోంది. రంతన్ భట్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి