స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. ఒకే సినిమాను ఐదు ఆరు భాషల్లో విడుదల చేస్తున్నారు. పెద్ద సినిమాలను ఏకంగా 10, 14 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న సినిమాలు కూడా పుంజుకుంటున్నాయి. కంటెంట్ ను నమ్ముకొని రంగంలోకి దిగుతున్న చిన్న సినిమాలు రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి.

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!
Movie

Updated on: Sep 23, 2026 | 9:42 PM

సినిమా హిట్ కావాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరో, స్టార్ హీరోయిన్, భారీ ప్రమోషన్స్ ఉండాల్సిందేనని చాలామంది భావిస్తుంటారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తాయి. కథ బాగుంటే, ప్రేక్షకులకు నచ్చితే సినిమా ఎలాంటి హంగామా లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేయగలదని నిరూపించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాల జాబితాలో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ‘ముంగారు మాలే’ ప్రత్యేకంగా నిలుస్తుంది. 2006లో కన్నడ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గణేష్, పూజా గాంధీ జంటగా నటించిన ఈ సినిమాకు విడుదలకు ముందు భారీ స్థాయిలో హైప్ లేదు. పెద్ద స్టార్ కాస్ట్ కూడా లేదు. అయినప్పటికీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ఆ హీరోతో నటించడం నాకు ఇష్టం లేదు.. అందుకే ఒక్క సినిమాకూడా చేయలేదు..

సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ క్రమంగా మరింత మందిని థియేటర్లకు రప్పించింది. ఒకరి నుంచి మరొకరికి సినిమాపై ప్రశంసలు వెళ్లడంతో ‘ముంగారు మాలే’కి రోజురోజుకూ ఆదరణ పెరిగింది. ఫలితంగా ఈ చిన్న సినిమా ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ విజయాన్ని అందుకుంది. ‘ముంగారు మాలే’ సాధించిన అతిపెద్ద రికార్డుల్లో థియేట్రికల్ రన్ ఒకటి. ఈ చిత్రం ఏకంగా 460 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శితమై అప్పట్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలోనూ ఈ సినిమాకు విశేషమైన ఆదరణ లభించింది. బెంగళూరులోని పీవీఆర్‌లో ఈ చిత్రం ఏడాది కంటే ఎక్కువ కాలం ప్రదర్శితమవడం అప్పట్లో కన్నడ సినీ పరిశ్రమలోనే ప్రత్యేకమైన విషయంగా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై ఇంత సుదీర్ఘమైన థియేట్రికల్ రన్ సాధించడం సినీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?

ఈ సినిమా నిర్మాణానికి అప్పట్లో సుమారు రూ.70 లక్షల బడ్జెట్ మాత్రమే ఖర్చయిందని చెప్పబడింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ స్థాయిలో వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.75 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. అంటే పెట్టిన పెట్టుబడితో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఈ సినిమా రాబట్టింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నడ చిత్రాల్లో అత్యంత ప్రభావం చూపిన సినిమాల్లో ‘ముంగారు మాలే’ ఒకటిగా నిలిచిపోయింది. ‘ముంగారు మాలే’ విజయానికి ప్రధాన కారణాల్లో కథాంశం ఒకటి. భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టార్ హీరోల ఇమేజ్, విపరీతమైన గ్లామర్ వంటి అంశాలపై ఆధారపడకుండా కథ, భావోద్వేగాలు, ప్రేమను కేంద్రంగా చేసుకుని సినిమా తెరకెక్కింది. ప్రేక్షకులతో భావోద్వేగంగా కనెక్ట్ అయ్యే కథనం, పాటలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు అదనపు బలంగా మారాయి. దీంతో యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరించారు. ‘ముంగారు మాలే’ క్రేజ్ అంతటితో ఆగిపోలేదు. మొదటి భాగం విడుదలైన దాదాపు పదేళ్ల తర్వాత 2016లో ‘ముంగారు మాలే 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమాపై ఉన్న ఆసక్తి కారణంగా సీక్వెల్‌పైనా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక చిన్న కన్నడ సినిమా ఎలాంటి భారీ హంగామా లేకుండా విడుదలై.. ప్రేక్షకుల మౌత్ టాక్‌తో సంచలన విజయాన్ని అందుకుని.. ఏకంగా 460 రోజుల పాటు థియేటర్లలో ఆడింది. నిజంగా అరుదైన విషయమే. అందుకే కన్నడ సినిమా చరిత్రను ప్రస్తావించినప్పుడల్లా ‘ముంగారు మాలే’ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్‌తో నాకు గట్టిపోటీ ఉండేది.. ఇద్దరం తగ్గేవాళ్లం కాదు..! మీనా సెన్సేషనల్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us