
Chiranjeevi : స్వతంత్ర దినోత్సం సందర్భంగా మువ్వనేల రెపరెపలాడుతోంది. ప్రముఖులు జాతీయ జెండాను ఎగరవేసి సంబరాలు చేసుకుంటున్నారు. సొషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ‘అందరికీ 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! స్వాతంత్య్రా సాధనకు కృషి చేసిన ఎంతో మంది వీరులకు, వారి పోరాటాలకు,త్యాగాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. మీరిచ్చిన ఈ బహుమతి ఎంతో అమూల్యమైనది.” అంటూ రాసుకొచ్చారు మెగాస్టార్.
ఇక ఇప్పటికే పలువురు సినిమాతారలు కూడా జెండాను ఎగరవేసి స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆఫిస్లో జండాను ఆవిష్కరించారు. అనంతరం దేశం గురించి, పోరాట యోధుల గురించి ఆయన ప్రసంగించారు. ఇక సినిమాలు విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అలాగే పవన్ బీమ్లానాయక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా రానా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :