Ram Charan: మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా..: రామ్ చరణ్

మెగా స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్.

Ram Charan: మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా..: రామ్ చరణ్
Ram Charan

Updated on: Jun 01, 2026 | 10:44 PM

రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. విజయవాడలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు .. సక్సెస్ మీట్ లా ఉంది. విజయవాడలో చెయ్యాలని అనుకున్నాం.. ఇది మాకు లక్కీయాస్ట్ సిటీ.. ఆ లక్కు కోసమే ఇక్కడకి వచ్చాము.. పెద్ది అన్ని విజువల్స్ చూశారు.. ఎన్నో కథలు వింటుంటాం.. కొన్ని కథలు నచ్చుతాయి, కొన్ని కథలు ఆశ్చర్యపరుస్తాయ్.. కానీ పెద్ది కథ నా గుండెలను తాకిన కథ.. నిజంగా ఇలాంటి సినిమాలు పదేళ్లకు ఒకసారి వస్తాయ్. పెద్ది సినిమా చాలా చేసింది.. వ్యక్తిగతంగా నన్ను ఒక మంచి దారిలోకి మార్చింది.. ఒక యాక్టర్ గా చాలా సంతృప్తి ఇచ్చింది.

ఇది మామూలు సబ్జెక్ట్ కాదు.. కిందకి పడి.. పడిన మనిషి లేని ఎలా నిల్చుంటాడో తెలిసేలా చేసిన కథ ఇది.. ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతాం..? బహుశా మగధీర, రంగస్థలం, ట్రిపుల్ ఆర్ తర్వాత నాకు పెద్దిలో ఆ అద్భుతం కనిపిస్తుంది.. రాసిపెట్టుకోండి.. ఇండియాలో నెంబర్ 3,4లో టాప్ డైరెక్టర్స్‌లో బుచ్చిబాబు పేరు ఉంటుంది. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి కారణం అభిమానులే.. మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా.. నాకు తెలిసింది సినిమా మాత్రమే.. చనిపోయేవరకు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాం.. అలాగే రెహమాన్ గారు 280 రోజులు మేం పని చేస్తే.. దానికి ప్రాణం పోస్తున్నారు.. ఆయనకు థ్యాంక్యూ..  జాన్వీ గారిని చూసి శ్రీదేవి గారు ఎక్కడున్నా గర్వంగా, ఆనందంగా ఫీల్ అవుతుంటారు.. ఎప్పుడైనా ఆట ఓడిపోతే.. ఒక దేశం మొత్తం ఓడిపోయినట్లు.. అలాగే ఈ పెద్ది గాడు ఆటాడలేదు.. పోరాడాడు.. పెద్ది గాడి ఆత్మగౌరవాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తారని మనస్పూర్తిగా దుర్గమ్మను కోరుకుంటున్నాను.. మీ కుటుంబ సభ్యులను అడిగానని చెప్పండి..

Follow Us