చేసినవి 6 సినిమాలైతే అన్ని ఫ్లాపే.. కట్ చేస్తే.. మాజీ సీఎం మనవడితో చెట్టాపట్టాల్.. ఆమె ఎవరంటే.?

ఈ క్రేజీ హీరోయిన్ తన కెరీర్‌లో చేసినవి ఆరు సినిమాలు అయితే.. అవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్‌గా మారాయి. కట్ చేస్తే.. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మనవడిని పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా ఉంది. ఆమె ఎవరంటే.? ఆ వివరాలు ఇలా..

చేసినవి 6 సినిమాలైతే అన్ని ఫ్లాపే.. కట్ చేస్తే.. మాజీ సీఎం మనవడితో చెట్టాపట్టాల్.. ఆమె ఎవరంటే.?
Actress

Updated on: Aug 08, 2025 | 11:44 AM

సినీ ఇండస్ట్రీలో రిలేషన్‌షిప్‌లు, బ్రేకప్‌లు అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే.. ఇవి చాలా కామన్. మొన్నటివరకు హీరోయిన్ కరీనా కపూర్ బంధువు అదర్ జైన్, నటి తారా సుతారియా రిలేషన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ అది ఎక్కువకాలం నిలవలేదు. చివరకు ఇద్దరూ విడిపోయారు. అదర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. తారా తన కొత్త ప్రేమ జీవితంలోకి అడుగుపెట్టింది.

గత కొన్ని రోజులుగా తారా సుతారియా తన వ్యక్తిగత జీవితం కారణంగానే తరచూ వార్తల్లో నిలుస్తోంది. తారా, వీర్ పహాడియాతో డేటింగ్ చేస్తుండగా.. వీరిద్దరూ తరచుగా కలిసి తిరుగుతూ కెమెరాల కంటపడ్డారు. ఇక ఇటీవల ఇంటర్వ్యూలో నటి తారా తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. ‘ప్రేమకు అతీతమైనది ఏదీ లేదు. ప్రేమ ముందు ప్రతిదీ విఫలమవుతుంది, కెరీర్‌తో సహా. దీనికి వ్యతిరేకంగా మాట్లాడే ఎవరైనా ప్రపంచంలో ఎక్కడా జీవించలేరు.’ అని చెప్పింది.

తారా సుతారియా భాగస్వామి క్వాలిటిస్..

‘కచ్చితంగా చెప్పాలంటే, నన్ను అర్థం చేసుకునే.. నన్ను ప్రేమించే.. భాగస్వామి నాకు కావాలి. వేరొకరి కోసం సమయం కేటాయించడం చాలా ముఖ్యం. మీరు సమయం ఇస్తే.. అది ప్రపంచంలోని ప్రతి అమ్మాయికి ప్రత్యేకమైనది. ప్రతి అమ్మాయి తాను ప్రేమించే వ్యక్తి నుంచి సమయం కోరుకుంటుంది..’ అని తారా చెప్పుకొచ్చింది.

ఇది చదవండి: స్టార్ హీరో అయితే నాకేంటి.! లిప్‌లాక్ సీన్ వద్దని తెగేసి చెప్పిన హీరోయిన్.. ఆమె ఎవరంటే.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి