
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ వరుస సినిమాలతో మళ్లీ బిజీగా మారిపోయాడు. ముఖ్యంగా ఇప్పటివరకు హీరోగానే కనిపించిన మనోజ్ మిరాయ్ సినిమాలో విలన్ గా అదరగొట్టాడు. ‘ది బ్లాక్ స్వోర్డ్’ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఇదే పాత్రకు ప్రతిష్ఠాత్మక ‘సైమా అవార్డ్స్ 2026’లో ఉత్తమ విలన్ పురస్కారాన్ని అందుకున్నాడీ రాక్ స్టార్. ఈ మేరకు మిరాయ్ సినిమా విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంలోనే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం విశేషమంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు మనోజ్. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి భార్య మౌనికకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడీ హీరో. ‘నేను నా భవిష్యత్తును సరిగా ఊహించుకోలేక ఇబ్బంది పడుతున్న సమయంలోనే నా భార్య మౌనిక నా జీవితంలోకి వచ్చింది. తను నన్ను నమ్మింది. మిరాయ్ సినిమా షూటింగ్ సమయంలోనే నా చిట్టి దేవసేన మౌనిక కడుపులో ఉంది. నేడు ఈ ఈవెంట్లో నా భార్య పిల్లలు కూర్చుని నేను ఈ అవార్డు తీసుకోవడం చూసిన ఈ క్షణాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. అమ్మానాన్నల నుంచి నాకు సినిమా పట్ల ప్రేమ విలువలు పెరిగాయి. నా జీవితంలో ప్రతిదీ అమ్మ నాన్నల నుంచే మొదలైంది. ఇక నా కెరీర్ రూపుదిద్దుకోక ముందే నన్ను నా అక్క మంచు లక్ష్మి ఒక అమ్మలాగా నన్ను నమ్మింది. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్క అభిమానికి కూడా ఈ అవార్డు అంకితం చేస్తున్నాను’ అని రాసుకొచ్చాడు మనోజ్.
కాగా 2018 తర్వాత సుమారు ఆరేళ్ల పాటు ఒక్క సినిమా కూడా చేయలేదు మంచు మనోజ్. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోనూ చాలా సమస్యలు ఎదుర్కొన్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అయితే ఎప్పుడైతే మౌనిక మనోజ్ జీవితంలోకి అడుగు పెట్టిందో అతని జీవితమే మారిపోయింది. పెళ్లి తర్వాత భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు మనోజ్. ఆ తర్వాత మిరాయ్ సినిమాలో విలన్ గా మెప్పించాడు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న దాదా చిత్రంలో మరోసారి విలన్ రోల్ లో కనిపించనున్నాడు మనోజ్. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా దాదా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
WE WON. ❤️🙏🏻
On September 12, 2025, MIRAI met the world. One year later, on that same date, I stood at SIIMA with my family in the audience and heard my name called for The Black Sword. ⚔️
I came back playing a villain.
You celebrated me like a hero.To my Telugu audience and… pic.twitter.com/GwiKalpwwv
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 13, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.