
రాకింగ్ స్టార్, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రీల్ లైఫ్ లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నాడు. సినిమాల పరంగా అతని కెరీర్ ఎలా ఉన్నా సామాజిక సేవా కార్యక్రమాలతో మాత్రం అందరి మన్ననలు అందుకుంటున్నాడీ మంచు వారబ్బాయి. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఐక్య ధైర్య సేన సమితిని మంచు మనోజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తన భార్య మౌనికతో కలిసి అయిదుగురు పిల్లలను దత్తత తీసుకున్నాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు మనోజ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీ రీ బర్త్ ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వెరైటీ ఛాలెంజ్ ను స్వీకరించిన మనోజ్ రంగారెడ్డి జిల్లా నాదర్గుల్‌లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ మతి స్థిమితం లేకుండా బాధపడుతోన్న వ్యక్తికి నూతన జీవితాన్ని అందించాడు. అతనికి స్వయంగా హెయిర్ కట్ చేసి స్నానం చేయించాడు. అనంతరం నూతన వస్త్రాలు బహూకరించాడు. మతిస్థిమితం లేని వ్యక్తితో పాటు ఆశ్రమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని నిర్వాహకుడు గిరికి మనోజ్ ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.
కాగా మతి స్థిమితం లేని వ్యక్తికి మంచు మనోజ్ హెయిర్ కట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు మంచు వారబ్బాయిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ మిరాయ్ మూవీలో విలన్ గా అదరగొట్టాడు. ఇప్పుడు అతని చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. డేవిడ్ రెడ్డి, వడ్డీ కాసులవాడ సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. అలాగే గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు మంచు మనోజ్.
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్‌లోని ‘మాతృదేవోభవ’ అనాథ ఆశ్రమాన్ని సినీ నటుడు మంచు మనోజ్ సందర్శించారు.
As part of the “Celebrity Rebirth Challenge,” he gave a new life to an orphan. A mentally unstable man who was wandering on the Malakpet road was taken in by the ashram organizers.… pic.twitter.com/wHpC3NKn3F
— Milagro Movies (@MilagroMovies) May 26, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.