Manchu Lakshmi and Rakul Preet : పాపులర్ పంజాబీ సాంగ్‌కు స్టెప్పులేసిన మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్

|

Jun 04, 2022 | 7:32 AM

మంచు లక్ష్మీ ప్రసన్న సినిమాల గ్యాప్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తన ఫోటోలు, ఫ్యామిలీతో సరదాగా గడిపిన వీడియోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటారు.

Manchu Lakshmi and Rakul Preet : పాపులర్ పంజాబీ సాంగ్‌కు స్టెప్పులేసిన మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్
Rakul And Manchu Lakshmi
Follow us on

మంచు లక్ష్మీ ప్రసన్న(Manchu Lakshmi) సినిమాల గ్యాప్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తన ఫోటోలు, ఫ్యామిలీతో సరదాగా గడిపిన వీడియోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటారు. ఇక మంచు లక్ష్మీ కి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్న విషయం తెలిసిందే. గతంలో పలు షోలు కూడా నిర్వహించారు లక్ష్మీ. సినిమాతారలను ఇంట్రవ్యులు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో పలువురు హీరోయిన్స్ తో మంచు లక్ష్మీ మంచి ప్రెండ్ షిప్ ఉంది. తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ తో కలిసి డ్యాన్స్ చేశారు మంచు లక్ష్మీ. రకుల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది రకుల్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పాప్యులర్ పంజాబీ సాంగ్ కు మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ అదరగొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్  సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్ లో ‘డాక్టర్ జీ’, ‘థ్యాంక్ గాడ్’, ‘అయలాన్’, ‘ఛత్రివాలీ’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే శంకర్ దర్శకత్వంలో రాబోతున్న భారతీయుడు 2 సినిమా చేస్తుంది. అలాగే మంచు లక్ష్మి ‘లేచింది మహిళా లోకం’ సినిమాలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి