KGF Movie: రాకీ భాయ్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. తెలుగులో మళ్లీ రిలీజ్ కానున్న ‘కేజీఎఫ్’ ?..

|

Jan 25, 2024 | 5:06 PM

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ నటించిన ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు.. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గవ భారతీయ సినిమాగా నిలిచింది. ఇందులో యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్ కీలకపాత్రలు పోషించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో నిర్మించింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

KGF Movie: రాకీ భాయ్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. తెలుగులో మళ్లీ రిలీజ్ కానున్న కేజీఎఫ్ ?..
Kgf
Follow us on

కేజీఎఫ్.. పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను షేక్ చేసిన సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కోలార్ గోల్డ్ మైన్స్‏ నేపథ్యంలో తెరకెక్కిన ఈ కన్నడ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ హీరో యష్ నటించిన ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు.. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గవ భారతీయ సినిమాగా నిలిచింది. ఇందులో యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్ కీలకపాత్రలు పోషించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో నిర్మించింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాగే ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన కేజీఎఫ్ 2 సైతం భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇప్పుడు అడియన్స్ అంతా కేజీఎఫ్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేజీఎఫ్ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ తెలుగులో రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. హైదరాబాద్‏లో ఫిబ్రవరి 3న ఈ సినిమా తెలుగు వెర్షన్ రీరిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. కానీ మరోసారి కేజీఎఫ్ విడుదల కాబోతుందని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఈ మూవీలో ప్రతి సాంగ్ సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యాయి.

ఇదిలా ఉంటే..డైరెక్టర్ ప్రశాంత్ ఇటీవలే సలార్ సినిమాతో మరో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇందులో శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ మూవీ తర్వాత అటు సలార్ 2, కేజీఎఫ్ 2, ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నారు నీల్. అయితే ఈ మూడు చిత్రాల్లో ఏది ముందుగా రాబోతుందనేది మాత్రం తెలియరాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.