
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu )నటించిన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందు వచ్చింది. మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది సర్కారు వారి పాట. సినిమా చూసేందుకు థియేటర్స్ దగ్గర బారులు తీరుతున్నారు అభిమానులు. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది సర్కారు వారి పాట. అయితే మహేష్ అభిమానులకు ఫస్ట్ డే ఫాస్ట్ షో చూసేందుకు టీవీ 9 ఏర్పాటు చేసిన కాంటెస్ట్ కు విశేష స్పందన లభించింది. అనౌన్స్ చేసిన ప్రకారం విజేతలకు సినిమా టికెట్స్ ఇవ్వనుంది టీవీ9. ట్విట్టర్ వేదికగా మహేష్ డైలాగ్ ను అనుకరించి వీడియో రూపంలో పంపి సర్కారు వారి పాట టికెట్స్ గెలుచుకున్న విజేతలు వీరే..
<
కాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన సర్కారువారి పాట ఇవాళే గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ టాక్ బెటర్‌గా వుండడంతో ఎటుచూసినా పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. తెల్లవారుజామున మూడున్నరకే ప్రీమియర్స్ షురూ అయ్యాయి. ఫ్యాన్స్ హంగామాతో థియేటర్ల వద్ద సౌండ్ ఓ రేంజ్లో వుంది. సరిలేరు నీకెవ్వరు రిలీజయ్యాక రెండేళ్ల గ్యాప్ ఇచ్చి వచ్చిన మహేష్ మూవీగా సర్కారువారిపాటపై క్రేజ్ విపరీతంగా వుంది.