Mahesh Babu: ‘ఉప్పెన’పై కొనసాగుతోన్న సెలబ్రిటీల ప్రశంసలు.. వరుస ట్వీట్లు చేసిన టాలీవుడ్‌ ప్రిన్స్‌..

Mahesh Babu Responce On Uppena Sucess: లాక్‌డౌన్‌ తర్వాత తొలి బంపర్‌ హిట్‌గా నిలిచింది 'ఉప్పెన' మూవీ. బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసుకున్న ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళుతోంది...

Mahesh Babu: ఉప్పెనపై కొనసాగుతోన్న సెలబ్రిటీల ప్రశంసలు.. వరుస ట్వీట్లు చేసిన టాలీవుడ్‌ ప్రిన్స్‌..

Updated on: Feb 23, 2021 | 9:31 AM

Mahesh Babu Responce On Uppena Sucess: లాక్‌డౌన్‌ తర్వాత తొలి బంపర్‌ హిట్‌గా నిలిచింది ‘ఉప్పెన’ మూవీ. బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసుకున్న ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళుతోంది. ఇక ఈ సినిమాకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫిదా అవున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, దర్శకులు ఉప్పెనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్‌ బాబు ఉప్పెన చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురించారు. మొన్నటి వరకు దుబాయ్‌ షూటింగ్‌ బిజీగా ఉన్న మహేష్‌ తాజాగా షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి కావడంతో కాస్త ఫ్రీ అయ్యాడు. దీంతో ‘ఉప్పెన’ చిత్రాన్ని వీక్షించాడు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా స్పందించి ప్రిన్స్‌ పలు వరుస ట్వీట్లు చేశాడు. ‘ఉప్పెన సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇదొక క్లాసిక్‌ మూవీ. బుచ్చి బాబు సనా (దర్శకుడు) నువ్వు కాలంతో గుర్తుండిపోయే సినిమాను తెరకెక్కించావు. చాలా గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా.. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీతో పాటు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌, వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టిలపై మహేష్‌ ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ ట్వీట్‌పై హీరోయిన్‌ కృతి శెట్టి ఆనందం వ్యక్తం చేసింది. మహేష్‌ ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ.. ఓ మై గాడ్‌.. మీకు చాలా ధన్యవాదాలు సార్‌. మా టీమ్‌ పడ్డ కష్టానికి మంచి ఫలితం లభించింది. సూపర్‌ స్టార్‌ లాంటి మహేష్‌ బాబు మమ్మల్ని స్టార్స్‌ అని పిలవడం నిజంగా నమ్మలేకపోతున్నాను’ అంటూ తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకుంది.

Also Read: ప్రేమలో మునిగి ఉన్నానంటున్న సాయిపల్లవి.. ఆసక్తికరంగా ట్వీట్ చేసిన హైబ్రిడ్ పిల్ల..

Loading...
Unable to load recommendations.
Follow Us