శ్రీలీల అందుకే నావైపు తిరిగింది.. అసలు ఏం జరిగిందో చెప్పిన మహేష్ ఆచంట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

శ్రీలీల అందుకే నావైపు తిరిగింది.. అసలు ఏం జరిగిందో చెప్పిన మహేష్ ఆచంట
Mahesh, Sreeleela

Updated on: Mar 16, 2026 | 5:05 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (ఆదివారం ) హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఓజీ లాంటి హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా నిన్నటి ఈవెంట్ లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ వీడియో లో నటుడు మహేష్ ఆచంట, శ్రీలీల మధ్య ఎదో సంథింగ్ జరిగింది అంటూ రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

నిన్న జరిగిన ఉస్తాద్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. కాగా పవన్ మాట్లాడుతుండగా వెనకనే ఉన్న శ్రీలీల ఒక్కసారిగా ఆమె వెనక ఉన్న మహేష్ వైపు తిరిగి చూసింది. మహేష్ ను కింది నుంచి పైకి చూసినట్టు ఈ వీడియోలో కనిపించింది. మహేష్ ఓ స్మైల్ ఇచ్చిన కూడా ఆమె పట్టించుకోలేదు..దాంతో ఈవీడియో పై నెటిజన్స్ ఇష్టమొచ్చిన వార్తలు రాసుకుంటూ సోషల్ మీడియాలో వీడియాను షేర్ చేస్తున్నారు. దీనిపై నటుడు మహేష్ క్లారిటీ ఇచ్చాడు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలిపాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో షేర్ చేస్తూ మహేష్ ఇలా రాసుకొచ్చాడు.. అంతకు ముందే శ్రీలీల తన ఫోన్ పట్టుకోమని నాకు ఇచ్చారు. ఆమె వెనక్కి తిరిగినప్పుడు కింద నా చేతిలో ఉన్న ఆమె ఫోన్ స్క్రీన్ ను చూశారు.. ఆతర్వాత నా వెనక ఉన్న పెద్ద స్క్రీన్ చూశారు అంతే అక్కడ జరిగింది. కొంతమంది దాని పై రకరకాలుగా ఎవరికీ ఇష్టమొచ్చినట్టు వారు రాసుకుంటున్నారు అంటూ క్లారిటీ ఇచ్చాడు మహేష్. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీసు ఆఫర్స్ గా కనిపించనున్నారు. పవన్ కు జోడీగా శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మార్చ్ 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us