Maharaja : మహారాజ దర్శకుడికి బహుమతిగా కాస్ట్లీ కారు.. ఆనందంతో పొంగిపోయిన డైరెక్టర్

|

Oct 07, 2024 | 12:38 PM

చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించాడు. ఆయనతో పాటు నట్టి, సింగం పులి, మమతా మోహన్‌దాస్, అభిరామి, మునిష్కాంత్, వినోద్ సాగర్ తదితరులు నటించారు. అజ్నీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

Maharaja : మహారాజ దర్శకుడికి బహుమతిగా కాస్ట్లీ కారు.. ఆనందంతో పొంగిపోయిన డైరెక్టర్
Vijay Sethupati
Follow us on

విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజా’ సూపర్ హిట్  అయిన విషయం తెలిసిందే.. దర్శకుడు నితిలన్‌కు లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చింది మూవీ టీమ్. నితిలన్ సామినాథన్ తమిళ చిత్రసీమలో కురంగు పోమి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా విజయం తర్వాత విజయ్ సేతుపతి 50వ సినిమా ‘మహారాజా’కి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించాడు. ఆయనతో పాటు నట్టి, సింగం పులి, మమతా మోహన్‌దాస్, అభిరామి, మునిష్కాంత్, వినోద్ సాగర్ తదితరులు నటించారు. అజ్నీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.

మహారాజ సినిమా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆలాగే ఆడియన్స్ మంచి రివ్యూలు ఇచ్చారు. ఒక సాధారణ కథ, నితిలన్ తన నాన్-లీనియర్ స్క్రీన్ ప్లే టెక్నిక్‌తో చాలా ఆసక్తికరంగా నడిపించాడు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేలో మహిళలపై లైంగిక వేధింపుల గురించి ఈ చిత్రంలో చూపించాడు. దాంతో ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. గత వారం తమిళంలో భారీగా విడుదల కానప్పటికీ అభిమానులను థియేటర్లకు రప్పించింది మహారాజా.

నితిలన్ సామినాథన్ తన ఆకట్టుకునే కథాంశం, స్క్రీన్‌ప్లేతో మహారాజాకి బలం ఇచ్చాడు. మహారాజ చిత్రం అభిమానులను ఎంతగానో ఆకర్షించింది అలాగే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇది జూలై 12న నెట్‌ఫ్లిక్స్ OTTలో కూడా విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్‌లో భారతదేశంలోని టాప్ 10 చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అదేవిధంగా, ఇది 14 దేశాలలో ట్రెండింగ్ లో ఉంది. విడుదలైన మొదటి రెండు రోజుల్లో, ఈ చిత్రం OTTలో 3.2 మిలియన్ వ్యూస్, 7.5 మిలియన్ వ్యూ అవర్స్ ను సాధించింది. విజయ్ సేతుపతి కెరీర్ బెస్ట్ ఫిల్మ్ మహారాజా హిందీలో రీమేక్ కానుంది. అద్భుతమైన స్క్రీన్ ప్లే, విజువల్స్ తో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న ఈ సినిమా దర్శకుడు నితిలన్ స్వామినాథన్ తదుపరి చిత్రం నయనతారతో ఉంటుందని తెలుస్తోంది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన మహారాజా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంలో, ఈ విజయాన్ని పురస్కరించుకుని, ఫ్యాషన్ స్టూడియోస్ తరపున, చిత్ర దర్శకుడు నితిలన్ సామినాథన్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. నితిలన్ సామినాథన్ తన ఎక్స్ పేజీలో ఈ ఫోటోను షేర్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.