Vishnu Vishal: తెలుగులో రిలీజ్ చేయమని నా భార్య కోరింది.. ‘ఎఫ్ఐఆర్’ సినిమా గురించి విష్ణు విశాల్

| Edited By: Ravi Kiran

Feb 06, 2022 | 10:04 AM

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Vishnu Vishal: తెలుగులో రిలీజ్ చేయమని నా భార్య కోరింది.. ఎఫ్ఐఆర్ సినిమా గురించి విష్ణు విశాల్
Vishnu Vishal
Follow us on

Vishnu Vishal: కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ చిత్రానికి మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌గ‌ర్వ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాగురించి హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నేను క్రికెటర్‌ని. మా నాన్న పోలీస్ ఆఫీసర్. ఎప్పుడూ ట్రాన్సఫర్ అవుతూనే ఉంటారు. క్రికెట్ వల్ల నాకు సయ్యద్ మహ్మద్ ఎక్కువ దగ్గరయ్యారు. నేను ఎప్పుడూ మతాలు, కులాలు, ప్రాంతాలు అని చూడను. వాటిపై నాకు నమ్మకం లేదు. మా ఇద్దరి మధ్య మతం ఎప్పుడూ రాలేదు. కానీ సమాజంలో జరిగిన సంఘటనలు బాధను కలిగిస్తుంటాయి. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా కొన్ని ఘటనలు నాకు గుర్తొచ్చాయి. ఈ సినిమాలో ఎవ్వరినీ, ఏ మతాన్ని కూడా బాధపెట్టబోం. మతం కంటే మానవత్వమే గొప్పది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.

రాక్షసన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయమని నా భార్య జ్వాల( గుత్తా జ్వాల ) అడిగారు. కానీ నేను ఆ సినిమాకు నిర్మాతను కాను. ఈ చిత్రాన్ని చూసిన నా భార్య ‘నువ్వే నిర్మాత కదా? ఈ సారి మాత్రం తెలుగులో కచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే’ అని అన్నారు. నా భార్య ఫ్రెండ్ రవితేజ గారి వద్ద పని చేస్తుంటారు. అలా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాం. నా స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుందని రవితేజ అన్నారు. ఇలాంటి సినిమాలు ఎలా సెలెక్ట్ చేసుకుంటావ్ అని అడిగారు. నేను మీలా మాస్ హీరో అవ్వాలని అనుకుంటున్నాను అని చెబితే.. నేను నీలా కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు. ఈ మూవీ రఫ్ కట్ చూసి షూర్ షాట్ హిట్ అని అన్నారు. కొన్ని కరెక్షన్స్ చెప్పారు. కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పారు. నా కెరీర్‌లో ఈ సినిమా హయ్యస్ట్ బిజినెస్ చేసింది. తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలు, కంటెంట్ సినిమాలను ఆదరిస్తారు అని చెప్పుకొచ్చారు విష్ణు విశాల్.

మరిన్ని ఇక్కడ చదవండి :

PM Modi: తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. పీఎం మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Rahul Ramakrishna: అంతా ఒట్టిదే తూచ్.. జోక్ చేశా అంటున్న నటుడు.. మండిపడుతున్న నెటిజన్లు

Ravi Teja: ఖిలాడీతో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న మాస్ మహారాజా రవితేజ.. హిందీ ప్రేక్షకులను కూడా నవ్విస్తాడంటున్న నిర్మాతలు..