Chiranjeevi- Rajinikanth: రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్..

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తన సినీ ప్రయాణంలో ప్రారంభంలో చిరంజీవి ఓ తమిళ చిత్రంలో కథానాయకుడిగా నటించినా అది విడుదల కాలేదు అన్న సంగతి మీకు తెలుసా. కానీ అదే సమయంలో చిరు విలన్ గా.. రజినీకాంత్ హీరోగా నటించిన ఓ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.

Chiranjeevi- Rajinikanth: రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్..
Rajinikanth, Chiranjeevi

Updated on: May 15, 2026 | 10:09 AM

మెగాస్టార్ చిరంజీవి తన నట జీవిత ప్రారంభ దశలో తమిళ చిత్ర పరిశ్రమతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నారు. చిరంజీవి ఓ తమిళ చిత్రంలో హీరోగా నటించారు. అయితే, దురదృష్టవశాత్తు కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఆ సినిమా మధ్యలోనే నిలిచిపోయింది. ఈ చిత్రంలో అగ్ర కథానాయిక కేఆర్ విజయ చిరంజీవి సరసన నటించడం విశేషం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర కథానాయకుల సరసన నటించిన కేఆర్ విజయతో కలిసి నటించే అవకాశం రావడం చిరంజీవికి అప్పట్లో నిజంగా ఒక అదృష్టంగా భావించారు. ఒక సందర్భంలో కేఆర్ విజయ మాట్లాడుతూ, చిరంజీవి, తాను హీరో హీరోయిన్లుగా ఒక చిత్రంలో నటించామని, కొన్ని రోజులు వర్క్ చేశామని, ఆ సినిమా ఆగిపోకుండా విడుదలయ్యి ఉంటే తమిళ చిత్ర పరిశ్రమలోనూ చిరంజీవి అగ్ర హీరోగా విజృంభించి ఉండేవారని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

ఆ తొలి చిత్రం ఆగిపోయినప్పటికీ, తదనంతర కాలంలో చిరంజీవి కొన్ని తమిళ చిత్రాల్లో నటించారు. వాటిలో 1981లో విడుదలైన రణవీరన్ చిత్రం ముఖ్యమైనది. ఈ చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటించగా, చిరంజీవి నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రను పోషించడం విశేషం. శ్రీదేవి ఈ చిత్రంలో కథానాయికిగా నటించారు. సత్యా మూవీస్ పతాకంపై ఆర్ ఎం వీరప్పన్, జి త్యాగరాజన్ రణవీరన్ చిత్రాన్ని నిర్మించారు. స్వతహాగా రచయిత అయిన వీరప్పన్ ఎంజీఆర్ ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్ర కథను సిద్ధం చేశారు. అయితే, అప్పట్లో రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఎంజీఆర్ ఈ చిత్రంలో నటించలేకపోయారు. చివరికి ఆ అవకాశం రజినీకాంత్ ను వరించింది. వర్ధమాన హీరోగా ఉన్న చిరంజీవిని విలన్ పాత్రకు ఎంపిక చేశారు. సినిమా పతాక సన్నివేశాల్లో రజినీకాంత్, చిరంజీవి చేసే థ్రిల్లింగ్ ఫైట్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వం వహించిన రణవీరన్ చిత్రం 1981 అక్టోబర్ 26న విడుదలైంది.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఈ తమిళ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి బందిపోటు సింహం పేరుతో విడుదల చేశారు. వేణు మూవీస్ సంస్థ అధినేత శ్రీనివాసరావు ఈ అనువాద చిత్రాన్ని విడుదల చేశారు. సరిగ్గా 43 ఏళ్ల క్రితం, 1982 మే 21న బందిపోటు సింహం చిత్రం తెలుగులో విడుదలైంది. తమిళంలో రణవీరన్ బాగానే ఆడినప్పటికీ, తెలుగులో మాత్రం బందిపోటు సింహం ఆశించిన విజయాన్ని సాధించలేక ఫ్లాప్‌గా నిలిచింది. ఇది చిరంజీవి సినీ ప్రస్థానంలో తమిళ చిత్ర పరిశ్రమతో ఆయనకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

Follow Us