Amaran Movie: దేశం కోసం ప్రాణమిచ్చిన జవాన్ కథే ‘అమరన్’.. అసలు ఎవరీ ముకుంద్ వరదరాజన్.. ?

|

Oct 30, 2024 | 8:22 PM

సౌత్ అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమరన్ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ మకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ రాజ్ పెరియసామి. ఇంతకీ ముకుంద్ వరదరాజన్ ఎవరో తెలుసా.. ?

Amaran Movie: దేశం కోసం ప్రాణమిచ్చిన జవాన్ కథే అమరన్.. అసలు ఎవరీ ముకుంద్ వరదరాజన్.. ?
కానీ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటం, ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌ వస్తుండటంతో నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీలోనూ అమరన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Follow us on

శివకార్తికేయన్‌ హీరోగా రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమరన్‌’ చిత్రంపై ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ రేపు విడుదలకానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈమూవీలో సాయి పల్లవి నటిస్తుంది. ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారు. ఇందులో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో.. సాయి పల్లవి అతడి భార్య ఇందు రెబెక్కా వర్గీస్‌ పాత్రలో కనిపించనుంది. ఇంతకీ ఈ ముకుంద్ వరదరాజన్ ఎవరో తెలుసా.. ? అతడి కథ వింటే మీ కళ్లు చెమ్మగిల్లుతాయి.

ముకుంద్ వరదరాజన్..

ఏప్రిల్ 12, 1983న కోజికోడ్‌లోని పివిఎస్ హాస్పిటల్‌లో జన్మించారు ముకుంద్. తల్లిదండ్రులు.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారి వరదరాజన్, తల్లి గీత. ఉన్నత పాఠశాల విద్యను తిరువనంతపురంలోని సెయింట్ థామస్ సెంట్రల్ స్కూల్లో పూర్తి చేసి.. 11,12 తరగతలు తిరువనంతపురంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కంప్లీట్ చేశారు. తండ్రి తమిళనాడుకు మారడంతో ముకుంద్ చదువు కూడా అక్కడే సాగింది. అతని కుటుంబానికి భారత సైన్యం వారసత్వం ఉంది. అతడి తాత, తండ్రి సొదరులు సైనికులు కావడంతో ఆర్మీ యూనిఫాం ముకుంద్ రక్తంలో ఉండిపోయింది. 2005లో సైన్యంలో చేరే అవకాశం రావడంతో 2006లో రాజ్‌పుత్ రెజిమెంట్‌లోని 22 రాజ్‌పుత్ బెటాలియన్‌లో లెఫ్టినెంట్‌గా చేరాడు. ఆ తర్వాత 2008లో కెప్టెన్‌గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి మిషన్‌లో పనిచేశాడు. 18 అక్టోబర్ 2012న మేజర్‌గా పదోన్నతి పొందారు. ఇందులో భాగంగా అదే ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన 44వ బెటాలియన్‌కు డిప్యూటేషన్‌నిచ్చి జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో నియమించారు. ఏప్రిల్ 25న 2014లో ఆపరేషన్ ఖాసీపత్రిలో వీరమరణం పొందాడు. మరణానంతరం 2015లో అతడికి అత్యున్నత సైనిక పురస్కారం అశోకచక్రతో సత్కరించింది కేంద్రం.

ఖాసీపత్రి ఆపరేషన్.. 25 ఏప్రిల్ 2014

25 ఏప్రిల్ 2014న, షోపియాన్ జిల్లాలోని ఖాసిపత్రి గ్రామంలో ఎన్నికల అధికారుల హత్యలలో నిందితుడైన జైష్-ఎ-మహ్మద్ కమాండర్ అల్తాఫ్ వానీతోపాటు మరికొందరు హార్డ్ కోర్ టెర్రరిస్టులు ఉన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో రైఫిల్స్ రెజిమెంట్‌లోని 44వ యూనిట్‌ను మోహరించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ నేతృత్వంలో ఉగ్రవాదులను అంతం చేయడానికి ఓ మిషన్ స్టార్ట్ చేశారు. సమాచారం అందిన 30 నిమిషాల్లోనే తన టీంతో కలిసి టెర్రరిస్టులు ఉన్న ఖాసిపత్రి గ్రామనికి చేరుకున్నాడు ముకుంద్. ఉగ్రవాదులు రెండంతస్తుల భవనంలో దాక్కున్నారని గ్రహించిన ముకుంద్ సైన్యం ఆ భవనాన్ని పూర్తిగా చుట్టుముట్టింది. అయితే ఈ విషయాన్ని గ్రహించిన ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరపడం స్టార్ట్ చేశారు. దీంతో వెంటనే కాల్పులు జరిపిన సైన్యం తలుపులు పగులగొట్టి భవనంలోకి ప్రవేశించింది. ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గంటలపాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొదటి ఉగ్రవాదిని కాల్చిచంపిన తర్వాత, మేజర్ ముకుంద్ అవుట్‌హౌస్ లోపల గ్రెనేడ్ విసిరాడు. ఈ భారీ పేలుడులో మరో ఉగ్రవాది హతమయ్యాడు. ఇంతలో ఆర్మీ అధికారి విక్రమ్ సింగ్‌పై కాల్పులు జరిపిన అల్తాఫ్ వానీ పారిపోయాడు. వారిని సైన్యం అనుసరించి యాపిల్ చెట్టు కింద దాక్కున్న అల్తాఫ్ వానీని చుట్టుముట్టి కాల్పులు జరిపింది. అల్తాఫ్ వానీతో జరుగుతున్న కాల్పుల సమయంలో ముకుంద్ దగ్గర బుల్లెట్స్ అయిపోవడానికి వచ్చాయి. చివరి బుల్లెట్ అయిపోవడానికి వచ్చిందని గ్రహించిన ముకుంద్ వ్యూహాత్మకంగా అల్తాఫ్ వానీని హతమార్చారు. మేజర్ ముకుంద్ సమయానుకుల ఆలోచన.. నాయకత్వం, నిర్ణయాలు ఆ ఆపరేషన్ విజయవంతం కావడానికి దోహదపడింది. కానీ ఆ సమయంలో జరిగిన ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మూడు బుల్లెట్లు ముకుంద్ శరీరంలోకి దూసుకెళ్లాయి. ఆపరేషన్ పూర్తయిన తర్వాత, మేజర్ కుప్పకూలిపోయాడు. వెంటనే శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. 31 ఏళ్ల వయసులో విధి నిర్వహణలో తన ప్రాణాలను అర్పించిన మేజర్ ముకుంద్‌ను దేశ అత్యున్నత పురస్కారం అశోక్ చక్రతో సత్కరించారు. ఆయన సతీమణి ఇందు రెబెక్కా వర్గీస్ ధైర్యంగా నిలబడి అశోకచక్రాన్ని స్వీకరించడాన్ని దేశం చూసింది.

Mukund

ఇందు రెబక్క వర్గీస్..

ఇందు రెబెక్కా, పతనంతిట్ట మారమన్‌కు చెందిన డాక్టర్ జార్జ్ వర్గీస్, అకమ్మల కుమార్తె. తిరువనంతపురంలోని పెరుర్కడ కోలాత్ హాస్పిటల్ డైరెక్టర్. బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, సింధు 2004లో మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ చేయడానికి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ (MCC)లో చేరింది. అదే సమయంలో, ముకుంద్ MCCలో జర్నలిజంలో పీజీ డిప్లొమా చదువుతున్నాడు. ఇక్కడే ఇద్దరు కలుసుకుని స్నేహితులయ్యారు. ఆ తర్వాత ప్రేమికులు అయ్యారు. తొమ్మిదేళ్ల ప్రేమ తర్వాత, ముకుంద్ ఇందు రెబెక్కా వర్గీస్‌ని ఆగస్టు 28, 2009న వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో కూతురు ఆర్ష్య జన్మించింది. ముకుంద్ మరణానంతరం బెంగళూరులోని ఆర్మీ స్కూల్‌లో మూడేళ్లపాటు టీచర్‌గా పనిచేశారు ఇందు. 2017లో చదువులో పీజీ చేసేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ఆమె అక్కడే తన కూతురితో కలిసి సెటిల్ అయ్యారు. కానీ గత జనవరిలో ఇండియాకు తిరిగి వచ్చింది. భారతదేశంతో తన కూతురి అనుబంధానని బలోపేతం చేయడానికే తిరిగి వచ్చానని తెలిపింది. ఇందు ప్రస్తుతం తిరువనంతపురం ఇంటర్నేషనల్ స్కూల్లో టీచర్. కుమార్తెను కూడా అక్కడ చేర్చారు. బోధనతో పాటు, రైటింగ్, పెయింటింగ్‌లో ప్రతిభశాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.