Kiran Abbavaram: వరస్ట్ సినిమా అని నేనే నా సినిమా నుంచి ఇంట్రవెల్‌లో లేచి వచ్చేసా.. : కిరణ్ అబ్బవరం

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత హిట్ అందుకోలేకపోయాడు. వరుసగా సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు చేశాడు.

Kiran Abbavaram: వరస్ట్ సినిమా అని నేనే నా సినిమా నుంచి ఇంట్రవెల్‌లో లేచి వచ్చేసా.. : కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram
Follow us

|

Updated on: Jun 17, 2024 | 3:28 PM

షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన హీరోల్లో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్. అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత హిట్ అందుకోలేకపోయాడు. వరుసగా సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. దాంతో కిరణ్ ఎపుడెపుడు హిట్ కొడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం లుక్, నటన పరంగా ప్రేక్షకులను మెప్పించినా కూడా.. కంటెంట్ పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు. పక్కింటి కుర్రాడిగా ఉండే కిరణ్ రియల్ లైఫ్ లోనూ చాలా హానెస్ట్ గా కూడా ఉంటాడు. ఎంత హానెస్ట్ గా అంటే.. తన సినిమా నచ్చకపోతే తానే థియేటర్ లో నుంచి బయటకు వెళ్ళిపోతాను అని చెప్తాడు. అలాగే  ఓ సినిమా నుంచి కూడా బయటకు వెళ్ళిపోయాడట కూడా..

ఓ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “నా సినిమాను నేను తిట్టుకుంటా.. నా సినిమా నేనే ఇంటర్వెల్ లో లేచి వచ్చేసా.. అని  అన్నాడు. ఏ వరస్ట్ సినిమారా బాబు.. ఎలా చూస్తాం అని నేనే లేచి వచ్చేసా.. నన్ను అందరూ తిట్టుకున్నారు. నా పక్కన వాళ్ళు తిట్టారు. నీ సినిమా, నువ్వే హీరో గా ఉండి నువ్వే ఇలా చేస్తే ఎలా అని.. హీరో అయితే ఎవరైతే ఏందీ.. మన సినిమా బాలేనప్పుడు మనం ఒప్పుకొని బయటకు వచ్చేయాలి. దాన్ని రుద్దితే ఏం వస్తది. బయటవాళ్ళకు అది ఏమైనా అనిపించవచ్చు కానీ మన మనసాక్షి ఉంటుంది కదా.. అని తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత మంచి వాడివి అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!
అరడజను సంబంధాలు చూశాడు.. కానీ పెళ్లికాలేదు.. పాపం చివరకు
అరడజను సంబంధాలు చూశాడు.. కానీ పెళ్లికాలేదు.. పాపం చివరకు
ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్
ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్
చందమామలో అందం, నదిలో సోయగం ఈ కోమలి రూపం.. ప్రగ్య పిక్స్ వైరల్..
చందమామలో అందం, నదిలో సోయగం ఈ కోమలి రూపం.. ప్రగ్య పిక్స్ వైరల్..
ఎన్పీఎస్ 2.0 వచ్చేస్తోంది.. కొత్త వెర్షన్లో మరిన్ని ప్రయోజనాలు..
ఎన్పీఎస్ 2.0 వచ్చేస్తోంది.. కొత్త వెర్షన్లో మరిన్ని ప్రయోజనాలు..
మార్కెట్‌‌లో మరో నయా స్కూటర్‌ రిలీజ్‌ చేసిన ఇవూమీ..!
మార్కెట్‌‌లో మరో నయా స్కూటర్‌ రిలీజ్‌ చేసిన ఇవూమీ..!
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..